'పోచమ్మ' (ఆహా) సిరీస్ రివ్యూ!
ఈ మధ్య కాలంలో గ్రామదేవతల నేపథ్యంలోని కథలకు క్రేజ్ పెరిగిపోయింది. గ్రామదేవతలకు సంబంధించిన కథలతో సినిమాలు .. సిరీస్ లు ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా రూపొందిన వెబ్ సిరీస్ 'పోచమ్మ'. హారర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్ కి, రమేశ్ ఇందిర దర్శకత్వం వహించాడు. కన్నడలో నటుడిగా .. దర్శక రచయితగా ఆయనకి మంచి పేరు ఉంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సిరీస్, తెలుగు - తమిళ భాషల్లో 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
అది అరకు ప్రాంతం. అక్కడ ఫెడ్రిక్ (రమేశ్ ఇందిర) ఒక ఎస్టేట్ ను కొనుగోలు చేస్తాడు. భార్య నాన్సీ .. పెద్ద కూతురు 'ఇవా'( ప్రియ శతమర్షన్) చిన్న కూతురు జెస్సీ (స్నేహల్ కామత్) ఇదే అతని కుటుంబం. 'ఇవా' భర్త డేవిడ్ (అర్జున్ అంబటి) కూడా వాళ్లతోనే ఉంటూ ఉంటాడు. అరకు ప్రాంతంలోని ఎస్టేట్ జెస్సీకి ఎంతగానో నచ్చుతుంది. అక్కడి వాతావరణాన్ని ఆమె ఎంతగానో ఇష్టపడుతుంది. ఆ ఎస్టేట్ వ్యవహారాలను రఘుపతి (అచ్యుత్ కుమార్) చూసుకుంటూ ఉంటాడు.
రఘుపతి భార్య శాంతి .. కొడుకు సురేశ్ .. కూతురు గాయత్రి ఆ ఎస్టేట్ లోనే పనిచేస్తూ ఉంటారు. రఘుపతి ఎంతటి నిజాయితీ పరుడో, శాంతి అంతటి వంకర బుద్ధిని కలిగి ఉంటుంది. భర్త నిజాయితీ కారణంగా పేదవాళ్లుగా మిగిలిపోయామనే ఒక అసంతృప్తి ఆమెలో అసహనానికి కారణమవుతుంది. ఆ కారణంగానే ఆ ఎస్టేట్ లో ఆమె చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. భర్త ఎంతగా చెప్పినా ఆమె తన పద్ధతిని మాత్రం మార్చుకోదు.
ఫెడ్రిక్ ఫ్యామిలీ అక్కడికి వచ్చిన రోజు నుంచే, జెస్సీతో సురేశ్ చనువుగా ఉండటం మొదలుపెడతాడు. ఆమె కూడా అతనితో సన్నిహితంగా ఉంటుంది. ఫెడ్రిక్ బంగ్లాకి ఎదురుగా .. ఆరుబయట ఓ చిన్న మందిరంలో 'పోచమ్మ తల్లి' విగ్రహం ఉంటుంది. అమ్మవారు అక్కడ ఇష్టపడి వెలిసిందని అంటారు. చుట్టుపక్కల వాళ్లంతా ఆ తల్లిని శక్తిమంతమైన దేవతగా కొలుస్తుంటారు.
అయితే తన బంగ్లా ఎదురుగా 'పోచమ్మ' విగ్రహం ఉండటం ఫెడ్రిక్ కి ఎంతమాత్రం నచ్చదు. రఘుపతి ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా, ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేయిస్తాడు. అతను ఇక పోచమ్మ శాపం నుంచి తప్పించుకోలేడని చుట్టుపక్కలవాళ్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే 'రెడ్డి' అనే వ్యక్తితో ఫెడ్రిక్ కి వైరం ఏర్పడుతుంది. ఆ తరువాత కొన్ని రోజులకే జెస్సీ చనిపోతుంది. ఆమె మరణానికి కారకులు ఎవరు? ఆ మరణం చుట్టూ అల్లుకున్న రహస్యాలు ఏమిటి? జరుగుతున్న సంఘటనలకు కారణం పోచమ్మ శాపమేనా? అనేది కథ.
ఎస్టేట్ ల నేపథ్యంలో గతంలో చాలానే కథలు వచ్చాయి. శ్రీమంతులు .. వాళ్లకి సంబంధించిన అనేక రహస్యాలకు నిలయాలుగా ఎస్టేట్ లు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందనేది బయట ప్రపంచానికి తెలిసే అవకాశాలు తక్కువ. ఒకవేళ తెలిసినా నోరువిప్పే సాహసం ఎవరూ చేయరు. అలాంటి ఒక ఎస్టేట్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.
సాధారణంగా ఎస్టేట్ కథలన్నీ కూడా ఆస్తులు .. వారసత్వాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆస్తుల కోసం సాగే హత్యల చుట్టూ నడుస్తూ ఉంటాయి. అయితే ఈ కథ, ఎస్టేట్ లోని పోచమ్మతల్లిని కేంద్రంగా చేసుకుని కొనసాగుతుంది. పోచమ్మ విషయంలో అక్కడి ప్రజల విశ్వాసం .. వాళ్ల నమ్మకాలను ఎంతమాత్రం పట్టించుకోని ఫెడ్రిక్ అహంభావం ఈ కథలో కీలకమైన అంశాలుగా కనిపిస్తాయి.
దర్శకుడు ఈ కథలో నాలుగు ప్రధానమైన పాత్రలను తీసుకున్నాడు. చనిపోయిన జెస్సీ పాత్ర చుట్టూ, అనుమానించదగినవిగా కొన్ని పాత్రలు కనిపిస్తాయి. ఆ జాబితాలో ఫెడరిక్ శత్రువు రెడ్డి .. అల్లుడు డేవిడ్ .. ఎస్టేట్ మేనేజర్ కొడుకు సురేశ్ ఉంటారు. ఈ పాత్రల పట్ల సందేహాలను రేకెత్తిస్తూ దర్శకుడు కథను మలుపులు తిప్పుతూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. జెస్సీ మరణానికి కారణం ప్రేమనా? ప్రతీకారమా? స్వార్థమా? మోహమా? పోచమ్మ శాపమా? అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తూ వెళతాయి.
ఈ సిరీస్ టైటిల్ 'పోచమ్మ'. కథకి కేంద్రస్థానం పోచమ్మనే. అయితే ఆ పోచమ్మకి సంబంధించిన సన్నివేశాలను బలంగా అల్లుకోలేదని అనిపిస్తుంది. అమ్మవారు అక్కడ వెలిసిందనీ .. మహాశక్తిమంతమైనదని చెబుతారు. అయితే అమ్మవారి పట్ల స్థానికులకుగల బలమైన విశ్వాసాన్ని చూపించలేదు. ఆ తల్లితో వాళ్లకి గల సెంటిమెంట్ ను ఆవిష్కరించే ప్రయత్నం చేయలేదు.
నిజానికి అమ్మవారి పట్ల ఆ స్థాయి విశ్వాసం ఉన్నప్పుడు, స్థానికులు ఆ విగ్రహాన్ని పెకిలించే సాహసం చేయరు. కానీ ఇక్కడ రఘుపతి చెబుతున్నా పనివాళ్లు వినిపించుకోరు. ఇక విగ్రహం పెకిలిస్తున్నా .. దూరంగా విసిరి పారేస్తున్నా ఎలాంటి ఎఫెక్టులు పడలేదు. ఇక జెస్సీ తాగేసి పెంకులతో కూడిన పైకప్పు పైకి ఎక్కడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆమె తాగేసి ఇల్లెక్కుతే, 'అక్కడికి ఎందుకు వెళ్లావ్' అని క్రింది నుంచి తల్లిదండ్రులు అడగడం మరీ విడ్డూరం.
దర్శకుడైన రమేశ్ ఇందిర ఈ సిరీస్ లో ప్రధానమైన పాత్రను పోషించాడు. పోచమ్మ విగ్రహాన్ని తొలగించి ఆ తల్లి ఆగ్రహానికి గురికావడమనే ఇంట్రెస్టింగ్ లైన్ ను ఆయన బాగానే సిద్ధం చేసుకున్నాడు. అయితే పోచమ్మతో పాటు ప్రధానమైన పాత్రలకి సంబంధించి సరైన కసరత్తు జరగలేదని అనిపిస్తుంది. అందువల్లనే ఆ పాత్రలు అంత పవర్ఫుల్ గా కనిపించవు. ఉత్కంఠను కలిగించే సన్నివేశాలు తేలికగా తెలీపోతూ ఉంటాయి. కథ పోచమ్మను వదిలేసి అటూ ఇటూ పరిగెడుతూ ఉండటం అసహనాన్ని కలిగిస్తుంది.
అచ్యుత్ కుమార్ .. రమేశ్ ఇందిర మంచి ఆర్టిస్టులు. అయితే వాళ్ల స్థాయిలో పాత్రలను డిజైన్ చేయలేదనే అనిపిస్తుంది. శ్రీ షా ఫొటోగ్రఫీ బాగుంది. ఎస్టేట్ నేపథ్యంలోని లొకేషన్స్ ను ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. ముత్తు గణేశ్ అందించిన నేపథ్య సంగీతం, కుతూహలంతో కథను ఫాలో అయ్యేలా చేస్తుంది.
'పోచమ్మ' అనే టైటిల్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎంచుకున్న లైన్ కూడా ఫరవాలేదు. కాకపోతే ప్రెజెంటేషన్ ఆశించిన స్థాయిలో లేదనిపిస్తుంది. రొటీన్ కి భిన్నంగా అనిపించే సన్నివేశాలను .. ఆడియన్స్ ఊహకి అందని క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తూ, కంటెంట్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.

Movie Details
Movie Name: Pochamma
Release Date: 2026-04-17
Cast: Ramesh Indira, Achyuth Kumar,Arjun Ambati, Snehal Kamath, Priya
Director: Ramesh Indira
Producer: Shruthi Naidu
Music: Muthu Ganesh
Banner: Shruthi Naidu Chitra
Review By: Peddinti
Trailer