'యూత్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
తమిళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ సినిమానే 'యూత్'. కెన్ కరుణన్ .. అనిష్మా అనిల్ కుమార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి కెన్ కరుణాస్ దర్శకత్వం వహించాడు. మార్చి 19వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 'యూత్'ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ సినిమా, పూర్తిస్థాయిలో వాళ్లను అలరించిందా లేదా అనేది చూద్దాం.
ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరముడు) సరోజ ( దేవదర్శిని) భర్యాభర్తలు. వారి సంతానమే ప్రవీణ్ (కరుణాస్). ఉన్నికృష్ణన్ ఒక బేకరీ నడుపుతూ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నెట్టుకొస్తుంటాడు. భార్యాభర్తలు కష్టపడుతూ, కొడుకును కార్పొరేట్ జూనియర్ కాలేజ్ లో చదివిస్తుంటారు. తమ కొడుకు బాగా చదువుకుని తమని ఉద్ధరిస్తాడనే బలమైన నమ్మకంతో సరోజ ఉంటుంది. అతను మాత్రం లవ్ అంటూ కాలేజ్ లో అమ్మాయిల వెంట తిరుగుతుంటాడు.
అదే కాలేజ్ లో చదువుతున్న ప్రేషిక (మీనాక్షి దినేశ్)ను ప్రవీణ్ ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా అతనిని ఆరాధిస్తూ ఉంటుంది. ఒకసారి ఆమె అత్యవసరంగా తన ఊరు వెళ్లవలసి వస్తుంది. అక్కడి నుంచి ఆమె తిరిగి వచ్చేలోగా, ప్రవీణ్ ను సోనాల్ (ప్రియాన్షు యాదవ్) ఆకట్టుకుంటుంది. సోనాల్ తో ప్రవీణ్ చనువుగా ఉండటాన్ని ప్రేషిక గమనిస్తుంది. తాను ఊరెళ్లి వచ్చేలోగా ప్రవీణ్ మారిపోయాడని ఆమె భావిస్తుంది. ఈ ఇద్దరి ప్రేమతో ప్రవీణ్ చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు.
ఇక గంగవల్లి (అనిష్మా అరుణ్ కుమార్) కూడా అదే కాలేజ్ లో చదువుతూ ఉంటుంది. ఒక చిన్నపాటి గొడవతోనే వాళ్లిద్దరి పరిచయం జరుగుతుంది. అప్పటి నుంచి ఆమె అతనితో స్నేహంగా ఉండటం మొదలుపెడుతుంది. ఆమె కూడా తనని ప్రేమిస్తుందనే ప్రవీణ్ భావిస్తాడు. ఒక వైపున ప్రేషిక ..ఒక వైపున సోనాల్ .. మరొక వైపున గంగవల్లి. ఈ ముగ్గురిలో ఎవరి ప్రేమ నిజమైంది? చివరికి ఎవరితో కలిసి ప్రయాణించాలని ప్రవీణ్ నిర్ణయించుకుంటాడు? చదువు విషయంలో తన పేరెంట్స్ కోరికను అతను నెరవేర్చగలుగుతాడా? అనేది కథ.
మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఆశలు .. కలలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. తమ పిల్లలు పెద్ద చదువులు చదవాలనీ .. పెద్ద ఉద్యోగాలు చేయాలని భావిస్తారు. అందుకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తుంటారు. కానీ టీనేజ్ లోకి .. కాలేజ్ క్యాంపస్ లోకి అడుగుపెట్టిన స్టూడెంట్స్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అప్పటివరకూ అందని స్వేచ్ఛ తమకి లభించిన ఆనందంలో ఉంటారు. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతిని పొందుతుంటారు.
అందం .. ఆకర్షణ .. అనే విషయాల పట్ల వాళ్లు ఆసక్తిని చూపుతుంటారు. అప్పటివరకూ ఉన్న అడ్డుగోడలు తొలగిపోయినట్టుగా భావిస్తూ, అమ్మాయిలతో స్నేహానికి .. ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. తాము చదువుకోవడానికి వచ్చామని గానీ, తమపైనే తమ పేరెంట్స్ ఆశలు పెట్టుకున్నారనే ఆలోచన గాని వారికి ఉండవు. ప్రేమ అనే రెండు అక్షరాల చుట్టూనే వాళ్లు ప్రదక్షిణ చేస్తుంటారు.
అలా చదువును గాలికొదిలేసి లవ్వంటూ తిరిగిన ఒక యువకుడి చుట్టూ దర్శకుడు అల్లుకున్న కథనే ఈ సినిమా. స్నేహం .. ఆకర్షణ .. ప్రేమ ఈ మూడు అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. కథలో భాగంగా .. అంచలంచెలుగా ఈ విషయాన్ని అనుభవంలోకి వచ్చేలా చేసిన తీరు మెప్పిస్తుంది. ఈ మూడింటి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది.
టీనేజ్ లో .. కొత్తగా కాలేజ్ క్యాంపస్ లోకి అడుగుపెట్టిన తరువాత, కొంతమంది స్నేహాన్ని ప్రేమ అనుకుంటారు .. మరికొంతమంది ఆకర్షణను ప్రేమ అనుకుంటారు. మరి అసలైన ప్రేమ ఎలా ఉంటుంది? అనే ఆలోచనను రేకెత్తిస్తూ ఈ కథను ఆవిష్కరించిన విధానం మనసుకు పట్టుకుంటుంది. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు .. అలాంటి ప్రేమను తల్లిదండ్రులు మాత్రమే పంచగలరు అనే సందేశాన్ని ఇచ్చిన తీరు మనసును కదిలిస్తుంది.
ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరివరకూ ఎక్కడా బోర్ అనిపించదు. ఎవరి కాలేజ్ లైఫ్ ను వాళ్లకి గుర్తుచేస్తూ ఈ కథ కొనసాగుతుంది. ప్రేమ .. అల్లరి .. అలకలు .. గొడవలు .. మందలింపులు .. ఎమోషన్స్ ఇలా అన్నిటినీ కలుపుకుంటూ వెళుతుంది. అందువలన ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది. ఆర్టిస్టులంతా కూడా ఎవరి పాత్రలో వాళ్లు జీవించారు. విక్కీ ఫొటోగ్రఫీ .. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం .. నాష్ ఎడిటింగ్ కథకు మరింత బలాన్ని అందిస్తాయి.
'నలుగురిలో విలువను పెంచేది .. మర్యాదానిచ్చేది .. జీవితాలను మార్చగలిగేది చదువు మాత్రమే. లవ్వంటూ సమయాన్ని వృథా చేసుకుని .. భవిష్యత్తును పాడుచేసుకోవద్దు. నిజమైన ప్రేమను పంచేది పేరెంట్స్ మాత్రమే. వాళ్ల కలను నిజం చేయడానికి కష్టపడండి' అనే సందేశంతో కూడిన సినిమా ఇది. ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేని ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.

Movie Details
Movie Name: Youth
Release Date: 2026-04-16
Cast: Ken Karunas,Suraj Venjaramoodu, Devadarshini,Anishma Anilkumar,Meenakshi Dinesh,Priyanshi Yadav,Nalini
Director: Ken Karunas
Producer: Karuppiah C Ram - Sulochana Kumar
Music: G V Prakash Kumar
Banner: Paarvathaa Entertainments
Review By: Peddinti
Trailer