'శబ్దం'(జీ 5) మూవీ రివ్యూ!
ఆది పినిశెట్టి కథానాయకుడిగా తమిళంలో రూపొందిన సినిమానే 'శబ్దం'. అరివళగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జోనర్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చింది. క్రితం ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన విడుదలైన ఈ సినిమా, థియేటర్స్ నుంచి 11 కోట్లను వసూలు చేసింది. 'జీ 5' ఓటీటీలో తమిళ .. హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
కేరళ ప్రాంతంలోని 'మున్నార్'లో ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఆ మెడికల్ కాలేజ్ కి 70 ఏళ్ల చరిత్ర ఉంటుంది. అలాంటి ఆ కాలేజ్ లో రెండు వారాలలో ఇద్దరు స్టూడెంట్స్ అనుమానాస్పద స్థితిలో చనిపోతారు. కాలేజ్ లో ప్రేతాత్మలు తిరుగుతున్నాయనే మీడియా కథనాలతో యాజమాన్యం తలపట్టుకుంటుంది. ముంబైలో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా పేరున్న 'వ్యోమా' (ఆది పినిశెట్టి)ని కాలేజ్ కి రప్పిస్తారు.
మనుషులకు వినిపించని శబ్దాలను తాను వినగలిగే సాంకేతిక పరికరాలు వ్యోమా దగ్గర ఉంటాయి. ఆ పరికరాలతో అతను ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మల కోరికలు తెలుసుకుంటూ, వాటితో పాటు ఆత్మల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి కూడా విముక్తిని కలిగిస్తూ ఉంటాడు. అలాంటి వ్యోమా, మెడికల్ కాలేజ్ యాజమాన్యం రిక్వెస్ట్ పై క్యాంపస్ లో అడుగుపెడతాడు. ఒక వారం రోజుల పాటు అక్కడే ఉండి .. దెయ్యలులేవనే సంగతిని మీడియాతో చెప్పేసి వెళ్లిపొమ్మని యాజమాన్యం కోరుతుంది.
కాలేజ్ వారు ఏర్పాటు చేసిన గెస్టు హౌస్ లో వ్యోమా దిగుతాడు. కాలేజ్ కి సంబంధించిన ఆంటోని అతనితోపాటే ఉంటాడు. ముఖేశ్ .. శ్వేత అనే స్టూడెంట్స్ మరణాల వెనుక కారణాలను కనుక్కోవడంలో వ్యోమా బిజీ అవుతాడు. చనిపోవడానికి ముందు వారు చాలా చిత్రంగా ప్రవర్తించారని తెలుసుకుంటాడు. ఏ రోజుకు ఆ రోజు వారి డెడ్ బాడీలలో అసహజమైన మార్పులు వస్తున్నాయని తెలుసుకుంటాడు. ఆ డెడ్ బాడీలపై ఒక చిత్రమైన 'ముద్ర'ను అతను గుర్తిస్తాడు.
అదే సమయంలో దీపిక అనే మరో స్టూడెంట్ చనిపోతుంది. ఆ సమయంలోనే అతను కాలేజ్ బిల్డింగ్ కి దూరంగా ఉన్న మరో బంగ్లాను చూస్తాడు. అది ఆ కాలేజ్ కి సంబంధించిన పాత లైబ్రరీ అనే విషయం తెలుసుకుంటాడు. ఆ కాలేజ్ లో రీసెర్చ్ వర్క్ చేస్తున్న అవంతిక (లక్ష్మీ మీనన్) ధోరణి వ్యోమాకి కాస్త తేడాగా అనిపిస్తుంది. ఆ పాత లైబ్రరీలోగానీ .. నెగెటివ్ ఎనర్జీ చేత ఆవహించబడిన అవంతిక గానీ జరుగుతున్న సంఘటనలకు కారణం కావొచ్చని వ్యోమా భావిస్తాడు. అందుకు సంబంధించి అతను చేసే ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడతాయనేది కథ.
మెడికల్ కాలేజ్ లో స్టూడెంట్స్ అనుమానాస్పద మరణాలు .. అందుకు ప్రేతాత్మలు కారణమంటూ బయట జరుగుతున్న ప్రచారం .. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా రంగంలోకి దిగిన వ్యోమా .. చుట్టూ తిరిగే కథ ఇది. వరుస మరణాలకు .. శబ్దానికి ఉన్న సంబంధం ఏమిటి? చనిపోయినవారి శరీరంపై విచిత్రంగా కనిపించే చిత్రమైన ముద్ర వెనకున్న అర్థం ఏమిటి? అనే అంశం చుట్టూ కథను నడిపిస్తూ దర్శకుడు ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశాడు.
గబ్బిలాలు చేసే చిత్రమైన ధ్వనిని ప్రధానంగా చేసుకుని ఈ కథను అల్లుకున్నారు. 'శబ్దం' అనే టైటిల్ ఈ ధ్వనిలో నుంచి పుట్టిందే. అలాగే ఈ కథలో మరో కోణం వైపు నుంచి కూడా ఈ టైటిల్ కనెక్ట్ అవుతుంది. ఒక వైపున ప్రేతాత్మలు .. మరో వైపున చేతబడి .. ఇంకొక వైపున అజ్ఞాత వ్యక్తుల కుట్ర కోణాలను టచ్ చేస్తూ ఈ కథ కొనసాగుతుంది. ఈ మూడింటికీ ఉన్న సంబంధం ఏమిటనే దిశగా హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఆడియన్స్ కి కుతూహలాన్ని కలిగిస్తూ వెళుతుంది.
పాత బంగ్లాలో దెయ్యాల గోల .. అనే రొటీన్ ట్రాక్ లోనే ఈ కథ నడుస్తుందేమోనని అనుకుంటూ ఉండగా సిమ్రాన్ పాత్ర తెరపైకి వస్తుంది. 34 ఏళ్ల క్రితం నడిచే ఫ్లాష్ బ్యాక్ .. ఆ ఫ్లాష్ బ్యాక్ లో లైలా పాత్ర ఆడియన్స్ ముందుకు వస్తుంది. దర్శకుడు ఏయే అంశాల దగ్గర లాక్ చేస్తూ వెళ్లాడో, వాటిని ఎప్పుడు ఎక్కడ రివీల్ చేస్తాడో చూద్దామనే ఉద్దేశంతో ఆడియన్స్ వెయిట్ చేస్తారు. సమాధానాల కోసం కథను ఫాలో అవుతారు.
తన చుట్టూ ఉన్నది ఒకటి .. రెండు ఆత్మలు కాదు, అనేక ఆత్మలు అనే విషయం హీరోకి అర్ధమయ్యే సీన్ .. గబ్బిలాలు అతని వెంటపడే సీన్ .. పాత లైబ్రరీలో అవంతికను ఆత్మ ఆవహించే సీన్ ఈ సినిమాలో చెప్పుకోదగిన స్థాయిలో కనిపిస్తాయి. అయితే ఆత్మలు .. చేతబడి .. కుట్రకోణం .. సైన్స్ అంటూ చేసిన హడావిడి కాస్త గందరగోళంలోకి నెట్టినట్టుగా అనిపించకమానదు. కొంతమంది ప్రేక్షకులకు అయోమయాన్ని కలిగిస్తుంది కూడా.
ఈ సినిమా కథాకథనాల కంటే కూడా సాంకేతిక పరంగా ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. అరుణ్ పద్మనాభన్ ఫొటోగ్రఫీ బాగుంది. ఇక తమన్ అందించిన నేపథ్య సంగీతం, ఈ సినిమాకి ప్రాణమనే చెప్పాలి. ఆయన బీజీఎమ్ సన్నివేశాలలో నుంచి ఆడియన్స్ జారిపోకుండా చూస్తుంది. సాబూ జోసెఫ్ ఎడిటింగ్ కూడా ఓకే.
నటీనటుల వైపు నుంచి చెప్పాలంటే అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆది పినిశెట్టికి తగిన రోల్ పడిందని చెప్పచ్చు. అతని తరువాత బలమైన పాత్రలలో సిమ్రాన్ - లైలా కనిపిస్తారు. ఫస్టాఫ్ అనేక సందేహాలు రేకెత్తిస్తూ ముందుకు వెళుతుంది. సెకండాఫ్ మాత్రం కాస్త గందరగోళంగానే సాగుతుంది. అప్పుడప్పుడు భయపెడుతూ .. అక్కడక్కడా అయోమయాన్ని కలిగించే కంటెంట్ గానే ఈ సినిమాను గురించి చెప్పాల్సి వస్తుంది.

Movie Details
Movie Name: Shabdam
Release Date: 2026-04-10
Cast: Aadhi Pinisetty, Lakshmi Menon, Simran, Laila, Arthi Ashwin
Director: Arivazhagan
Producer: Siva
Music: Thaman
Banner: 7G Films
Review By: Peddinti
Trailer