'కాట్టాన్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
విజయ్ సేతుపతికి విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన పాత్రలతో వివిధ భాషలకి చెందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే, సిరీస్ లలో నిర్మాతగాను ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆయన కథానాయకుడిగా .. నిర్మాతగా రూపొందిన సిరీస్ గా 'కాట్టాన్' కనిపిస్తుంది. మణికందన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 27వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 7 భాషల్లో .. 10 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
అడవిని ఆనుకుని ఉన్న ఒక చిన్న విలేజ్ అది. అక్కడి పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ.గా సిద్ధార్థ్ .. కానిస్టేబుల్ గా కాళీ పాండియన్ ఉంటారు. మూడేళ్లుగా ఒక్క కేసు కూడా లేకపోవడంతో, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ ఎత్తేయాలనే ఒక ఆర్డర్ పై అధికారుల నుంచి వస్తుంది. దాంతో కాళీ పాండియన్ ఆలోచనలో పడతాడు. అతనిది ఆ ఊరే కావడం .. కొత్తగా పెళ్లి కావడం .. మేకల మందను చూసుకోవలసి ఉండటమే అందుకు కారణం. ఎవరికైనా డబ్బులిచ్చి కేసు బుక్ చేసైనా స్టేషన్ అదే ఊళ్లో ఉండేలా చూడాలని అనుకుంటాడు.
కాళీ పాండియన్ భార్యకీ .. అతని తల్లికి అసలేపడదు. వాళ్ల మేకలు కాసే కుర్రాడి పేరే కుట్టి కురుప్పు. ఒకసారి మేకలు కాయడానికి వెళ్లిన ఆ కుర్రాడు కొండపై నరకబడి ఉన్న ఒక మనిషి 'తల'ను చూస్తాడు. అతను అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఆ 'తల' తమ ఊరుకు చెందిన వ్యక్తిది కాదని తెలుసుకుంటారు. మొండెం కోసం ఎక్కడ వెదికినా దొరకదు. దాంతో ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడతారు.
ఆ తల 'ముత్తు' (విజయ్ సేతుపతి) అనే వ్యక్తిది అనేది వాళ్ల ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ముత్తు గురించి లోతుగా అన్వేషిస్తూ వెళ్లగా, సింధూ .. మీనా .. చిట్టి అనే యువతుల పేర్లు తెరపైకి వస్తాయి. అలాగే జానీ .. బెన్నీ .. జెర్సీ అనే పేర్లు కూడా వెలుగులోకి వస్తాయి. అసలు ఎవరు ఈ ముత్తు? అతనితో వీళ్లందరికీ ఉన్న సంబంధం ఏమిటి? ముత్తును ఎవరు చంపారు? అతని మొండెం ఏమైంది? అతణ్ణి కాట్టాన్ అని ఎందుకు పిలుస్తారు? అనే అంశాలను కలుపుకుంటూ కదిలే కథ ఇది.
పోలీస్ స్టేషన్ కి కేసులు రావడం .. ఆ కేసులపై పోలీసులు విచారణ జరపడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే ఈ కథలో .. పోలీస్ స్టేషన్ తన ఉనికిని కాపాడుకోవలసి వస్తుంది. అందుకోసం ఆ పోలీస్ స్టేషన్ కి ఒక కేసు కావాలి. అలాంటి కేసు కోసం పోలీసులు వెతుకుతుండగా, మొండెం నుంచి వేరు చేయబడిన ఒక మనిషి తల, కొండపై దొరుకుతుంది. మొండెం దొరకని ఆ తల చుట్టూ నడిచే కథ ఇది.
ఒక వైపున పోలీసులు .. మరో వైపున రాజకీయనాయకులు .. ఇంకొక వైపున రౌడీల వైపు నుంచి ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ మూడు వర్గాలతో హీరోకి గల సంబంధం ఏమిటి? అనేది ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తించే ప్రధానమైన అంశమై కనిపిస్తుంది. హీరో పాత్రకి సంబంధించిన లవ్ స్టోరీస్ ను టచ్ చేస్తూ ఈ కథను నడిపించిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక కాళీ పాండియన్ భార్య .. తల్లి మధ్య జరిగే కోల్డ్ వార్, వినోదాన్ని పంచుతుంది.
ఈ కథలో ఎవరైతే హీరోనో ఆ వ్యక్తి 'తల'నే తెగిపడుతుంది. మొండెం దొరకని హీరో తలతోనే కథను మొదలు పెట్టడం నిజంగానే దర్శకుడు చేసిన పెద్ద సాహసంగా చెప్పుకోవలసి ఉంటుంది. ఎందుకంటే హీరో ఆల్రెడీ చనిపోయాడనే ఆలోచన రాగానే, ఆడియన్స్ కి ఇక కథను ఫాలో కావాలని అనిపించదు. అలాంటి ఫీలింగ్ ఎక్కడా కలగకుండా ఈ కథను అల్లుకోవడమే దర్శకుడి ప్రతిభకు నిదర్శనంగా కనిపిస్తుంది.
ఇక హీరోకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ను ఓపెన్ చేసి, ఏకధాటిగా అతని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించినా బోర్ కొట్టేది. కానీ దర్శకుడు అలా చేయలేదు. కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా, హీరోకి సంబంధించినవారిని ఒక్కొక్కరిగా పోలీసులు కలవడం .. వాళ్ల వైపు నుంచి హీరో కథను రివీల్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్ అన్నట్టుగా అనిపిస్తూనే, తిరిగి అవన్నీ ఒక దగ్గర కలుస్తాయి .. ఒకే గూటికి చేరతాయి.
ఇటు హీరో .. అటు హీరోయిన్స్ .. పోలీసులు .. రాజకీయనాయకులు .. రౌడీలు .. ఇలా ప్రధానమైన పాత్రలన్నింటినీ దర్శకుడు చాలా సహజంగా మలిచాడు. కథాకథనాలతో పాటు విలేజ్ నేపథ్యంలోని లొకేషన్స్ ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తాయి. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. రివెంజ్ అనే అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే సస్పెన్స్ లో ఉంచిన బలమైన అంశం .. స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను కూర్చోబెట్టేస్తాయి.
విజయ్ సేతుపతితో పాటు సుదేవ్ నాయర్ .. మిళింద్ సోమన్ .. వీజే పార్వతి .. రిచా జాకబ్ తమ పాత్రలలో మెప్పించారు. షణ్ముగా సుందరం - మధు నీలకందన్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన లొకేషన్స్ ను తెరపై ఆవిష్కరించిన విధానం అలరిస్తుంది. ఇక రాజేశ్ మురుగేశన్ నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి ప్రాణం లాంటిదని చెప్పుకోవాలి. షణ్ముగ సుందరం ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది.
ఒక మారుమూల గ్రామంలో మొదలయ్యే ఈ కథ, అక్కడి నుంచి అనేక మలుపులు తీసుకుంటుంది. ఫ్లాష్ బ్యాకులు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ సాగుతాయి. కథ నిదానంగానే నడుస్తుంది. అయితే ఈ కథ అల్లిక .. అది తీసుకునే మలుపుల ఆసక్తికరంగానే అనిపిస్తాయి.

Movie Details
Movie Name: Kaattaan
Release Date: 2026-03-27
Cast: Vijay Sethupathi, Milind Soman, Sudev Nair, Risha Jacobs, VJ Parvathi, Kalaivani Bhaskar, Muthu Kumar
Director: Manikandan
Producer: Vijay Sethupathi
Music: Rajesh Murugesan
Banner: -
Review By: Peddinti
Trailer