'హనీ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
నవీన్ చంద్ర ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్ కి చెందిన సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నాడు. ఈ తరహా సినిమాలు ఆయనకి మంచిపేరు తెచ్చిపెడుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలోనే ఆయన 'హనీ' అనే ఒక హారర్ థ్రిల్లర్ సినిమాను చేశాడు. ఈ నెల 6వ తేదీన విడుదలైన ఈ సినిమా, 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏ స్థాయిలో భయపెట్టగలిగిందనేది చూద్దాం.
ఆనంద్ (నవీన్ చంద్ర) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. అతను 'లలిత' (దివ్య పిళ్లై) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అతని కోసం తన వాళ్లను వదులుకుని వచ్చేస్తుంది లలిత. వారి సంతానమే పదేళ్ల పాప 'మీరా' (జయన్ని). ఆనంద్ ఒక ఆఫీసులో చిన్న జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే మొదటి నుంచి కూడా అతనికి క్షుద్ర విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆ క్షుద్రవిద్యలు ఫలిస్తే పెద్దగా కష్టపడకుండానే పెద్ద మొత్తంలో సంపాదించవచ్చనేది అతని ఆశ.
క్షుద్ర విద్యలలో ఆనంద్ కి సారంగపాణి (రాజా రవీంద్ర) గురువుగా ఉంటాడు. అప్పుడప్పుడు అతను వచ్చి రహస్యంగా ఆనంద్ ను కలిసి వెళుతూ ఉంటాడు. వాళ్లిద్దరూ కలిసి ఏదో తాంత్రికపూజ చేయనున్నారనే విషయాన్ని లలిత గ్రహిస్తుంది. వాళ్లిద్దరి మాటలలో 'మీరా' పేరు వినిపించడం ఆమెకి మరింత ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఆనంద్ వ్యవహార శైలి తేడాగా ఉండటంతో, ఆఫీసు నుంచి మాత్రమే కాదు, కాలనీ నుంచి కూడా తరిమేస్తారు.
దాంతో ఆనంద్ భార్యాబిడ్డలతో ఊరికి దూరంగా ఉన్న ఒక బంగ్లాకి మారతాడు. వాళ్లకి ఆ షెల్టర్ ను సారంగపాణి ఏర్పాటు చేస్తాడు. అక్కడ వాళ్లకి కావలసిన ఏర్పాట్లు చూసుకుకోవడానికి రవణ (దివి) ఉంటుంది. పిల్లలు పుట్టిన తరువాత నల్లపిల్లి నుంచి వచ్చే 'మాయ'కి తాంత్రిక శక్తులు ఉంటాయనీ, అందుకు సంబంధించిన ప్రయోగంలో 'మీరా'ను భాగం చేయనున్నారని లలితకి తెలుస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ ప్రయోగం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కథ.
జీవితంలో ఎదగాలంటే దైవాన్ని నమ్ముకునేవాళ్లు కొందరైతే, క్షుద్ర విద్యలను .. క్షుద్రశక్తులను నమ్ముకునేవాళ్లు కొందరు. కష్టపడకుండానే డబ్బు సంపాదించాలి .. సాధ్యమైనంత త్వరగా అనుకున్నది సాధించాలి అనుకునేవాళ్లు, మూఢనమ్మకాలను ఆశ్రయిస్తూ ఉంటారు. క్షుద్రవిద్యలు తెలిసినవారు ఇలాంటివారిపై ఆధారపడే తీరునే దర్శకుడు కథగా అల్లుకున్నాడు. బలహీనతలు మూఢనమ్మకాలకు ఎలా బలంగా మారుతుంటాయనేది ఆవిష్కరించాడు.
ఈ సినిమా పోస్టర్స్ చూడగానే .. ఇది దెయ్యాలకు సంబంధించిన కథగానీ, 'చేతబడి'కి సంబంధించిన కథగానీ అయ్యుంటుందనే ఒక ఆలోచన రాకుండా ఉండదు. అయితే ఆ రెండు అంశాలకు భిన్నంగా, 'నల్లపిల్లి మాయ' అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాంత్రిక శక్తుల సాధనంలో దాని ప్రాధాన్యతను విస్తరిస్తూ వెళ్లారు. క్షుద్రశక్తుల వైపు నుంచి కొత్త పాయింట్ ను టచ్ చేశారే .. ఇదేదో లైన్ వెరైటీగా ఉందే అని మనకి అనిపిస్తుంది.అయితే ఆ లైన్ ను ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోయారు.
అడవిలోని ఒక కొండ గుహలో సామూహిక క్షుద్ర విద్యలను అభ్యసించడంతో కథ మొదలవుతుంది. ఇక్కడి నుంచి అడుగడుగునా భయపడటం ఖాయమని ఆడియన్స్ అనుకుంటారు. కానీ అలాంటి వాతావరణామేదీ కనిపించదు. తాంత్రిక పూజ విధానం దగ్గర నుంచి ప్రతి అంశం కూడా హడావిడిగానే అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే దర్శకుడు అసలు విషయాన్ని రివీల్ చేశాడో, అక్కడి నుంచి ఆసక్తికరమైన కథనాన్ని నడిపించలేకపోయాడు.
'శ్రీచక్ర ఆశ్రమం' చూపించినప్పుడు .. అక్కడ 'ఆచారి' అనే పాత్రను పరిచయం చేసినప్పుడు లలితకి ఆ వైపు నుంచి దైవం సాయం లభిస్తుందేమో అనిపిస్తుంది. ఇక లలిత పక్కింటి యువతిగా .. తోటి టీచర్ గా 'విద్య' ను చూపించినప్పుడు అటు వైపు నుంచి ఏదో జరగబోతుందనే భావన కలుగుతుంది. కానీ ఈ ట్రాకులను .. పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేదు.
లలిత పాత్రను గొలుసులతో బంధించడం .. ఇంజక్షన్లు ఇవ్వడం .. మీరాకి పిల్లి వేషధారణలోని బాలిక 'ఆత్మ' కనిపించడం .. ఏదో ఆవహించిన దానికి మాదిరిగా 'రవణ' పనిచేయడం .. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బరువు లేకుండా తేలిపోతూ ఉంటాయి. సిల్లీగాను అనిపిస్తూ ఉంటాయి. కథాకథనాల ఆవిష్కరణ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం కొంతవరకూ నెట్టుకొచ్చాయి.
సాధారణంగా ఈ తరహా కథల్లో .. పాత్రల్లో నవీన్ చంద్ర బాగా చేస్తాడు. అయితే ఈ సినిమాలో అతని పాత్రను ఆ స్థాయిలో డిజైన్ చేయలేదు. అసలు ఈ కాన్సెప్ట్ కి సంబంధం లేని టైటిల్ గా 'హనీ' కనిపిస్తుంది. థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథకి ఈ టైటిల్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.
దెయ్యాలు .. చేతబడులకు సంబంధించిన కథలను జనాలు చూసే ఉన్నారు. అయితే క్షుద్రశక్తుల వైపు నుంచే మరో కొత్త పాయింటును టచ్ చేశారు. కథాకథనాలపై .. పాత్రలను డిజైన్ చేసే విషయంలో సరైన కసరత్తు జరగని కారణంగా, ఈ సినిమా ఆడియన్స్ పై ఏ మాత్రం ప్రభావితం చూపలేకపోయింది. ఎక్కడ భయపడాలో .. ఎందుకు భయపడాలో చెప్పలేకపోయింది.

Movie Details
Movie Name: Honey
Release Date: 2026-02-27
Cast: Naveen Chandra, Divya Pillai, Divi Vaidya, Raja Ravindra
Director: Karuna Kumar
Producer: Ravi Peetla
Music: Ajay Arasada
Banner: Ova Entertainments
Review By: Peddinti
Trailer