'యుఫోరియా' (మూవీ రివ్యూ)
గుణశేఖర్ .. దర్శకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎంతటి భారీ కథనైనా బలంగా చెప్పగల సమర్థుడు ఆయన. జానపద .. పౌరాణికాలను సైతం హ్యాండిల్ చేయగలనని ఆయన చాలాకాలం క్రితమే నిరూపించారు. అలాంటి గుణశేఖర్ కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమానే 'యుఫోరియా'. తన సొంత బ్యానర్లో ఆయన నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. గుణశేఖర్ తన రూట్ మార్చుకుని చెప్పిన ఈ కథ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
వింధ్య (భూమిక) ఒక పేరున్న కార్పొరేట్ స్కూల్ కి ప్రిన్సిపాల్ .. మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఆమె భర్త రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానంలో రాణిస్తూ ఉంటాడు. వారి ఏకైక సంతానమే వికాస్ (విఘ్నేశ్ గవిరెడ్డి). విలాసవంతమైన జీవితం అందుబాటులో ఉండటం వలన, వికాస్ వ్యసనాలకు బానిసవుతాడు. తన మిగతా నలుగురు స్నేహితులతో కలిసి మాదక ద్రవ్యాలను తీసుకుంటూ ఉంటాడు. ఆ మత్తులోనే ఈ ఐదుగురు స్నేహితులు చైత్ర అనే మైనర్ (సారా అర్జున్) ను పాడు చేస్తారు.
చైత్ర ఓ స్నేహితురాలితో కలిసి ఒక పార్టీకి వెళ్లి, అక్కడ ఈ బ్యాచ్ బారిన పడుతుంది. తల్లి - తండ్రి - ఓ తమ్ముడు. ఇదే ఆమె ఫ్యామిలీ. జరిగిన సంఘటనను ఆమె తల్లిదండ్రులతో చెబుతుంది. పరువు ప్రతిష్ఠల గురించిన ఆలోచన చేస్తున్న తల్లిదండ్రులకు ఆమెనే ధైర్యం చెబుతుంది. తప్పు చేసినవాళ్లకి శిక్ష పడవలసిందేనంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ జయదేవ్ ( గౌతమ్ మీనన్) రంగంలోకి దిగుతాడు.
పరువు ప్రతిష్ఠలే ప్రాణంగా భావిస్తున్న వింధ్యకి, చైత్ర రేప్ కేసులో A1గా తన కొడుకు వికాస్ ఉన్నాడనే విషయం తెలుస్తుంది. జీవితంలో ఎంతో ఎదుగుతాడని భావించిన కొడుకు విషయంలో ఇలాంటి ఒక వార్త వినవలసి వచ్చినందుకు ఆమె ఎంతో బాధపడుతుంది. అయితే తప్పు ఎవరు చేసినా శిక్షను అనుభవించవలసిందే అని ఆమె భావిస్తుంది. అందుకోసం ఆమె ఏం చేస్తుంది? ఒక కన్నతల్లిగా ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. పోలీస్ ఆఫీసర్ జయదేవ్ ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడు? రేప్ చేయబడిన చైత్ర పరిస్థితి ఏమిటి? అనేది కథ.
ఈ సినిమా మొత్తాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, దారితప్పిన ఒక కొడుకును గాడిలో పెట్టడానికి ఒక కన్నతల్లిపడే ఆరాటంగా చెప్పుకోవచ్చు. దర్శకుడు గుణశేఖర్ ఈ కథను ఎత్తుకున్న తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. 'నేను తప్పు చేశాను .. నన్ను శిక్షించండి ' అంటూ ఒక తల్లి తనపై తానే కేసు వేసుకుని కోర్టుకు రావడంతో ఈ కథ మొదలవుతుంది. అందుకు గల కారణంగా ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.
ఇక అప్పటి నుంచి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిన ఈ కథ, కొన్ని మలుపులు తీసుకుంటూ తిరిగి మళ్లీ కోర్టు రూమ్ కి చేరుకుంటుంది. ఇంతవరకూ వినోద ప్రధానమైన కథలను తెరకెక్కిస్తూ వచ్చిన గుణశేఖర్, ఈసారి అలాంటి ప్రయత్నం చేయలేదు. యూత్ ఎందుకు చెడిపోతోంది .. అందుకు కారణమైన మాదక ద్రవ్యాలకు అడ్డాలుగా మారుతున్నదేంటి? పిల్లలు చెడిపోవడంలో, అవసరాలకు మించిన డబ్బును అందుబాటులో ఉంచుతున్న తల్లిదండ్రుల పాత్ర ఎంత? మైనర్ లు చేస్తున్న నేరాలకు బాధ్యులు ఎవరు? అనే కోణాల్లో ఆయన ఆలోచన రేకెత్తిస్తూ వెళ్లారు.
కథలో ఒక సమస్యను లేవనెత్తడం .. దానిని ఆసక్తికరంగా నడిపించడం .. అనూహ్యమైన మలుపులతో పరుగులు తీయిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ముగింపు ఇవ్వడమనేవి ఒక సినిమా కథా బలాన్ని పెంచే అంశాలుగా కనిపిస్తాయి. అయితే ఫస్టాఫ్ వరకూ ఉత్కంఠను రేకెత్తించిన గుణశేఖర్, సెకండాఫ్ లో కథ బలహీన పడకుండా చూసుకోలేకపోయారు. భూమిక పాత్ర ఎప్పుడైతే డీలాపడిపోయిందో, కథ అక్కడి నుంచి పడిపోవడం మొదలైంది.
అత్యాచారానికి గురైన యువతి కుటుంబానికి న్యాయం జరగాలి. తన కొడుకు శిక్షను అనుభవిస్తూనే, మంచి మార్పు దిశగా అతను ప్రయాణించాలని అనుకునే ఒక తల్లి, తన పోరాటాన్ని కొనసాగించడంలో తడబడటం కథలో ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. ఇక అత్యాచారానికి పాల్పడిన కుర్రాళ్లకు చేసే పరీక్షలు .. జైల్లో గొడవలు .. డ్రగ్ రాకెట్లు ఇవన్నీ కూడా అసలు కథను పక్కకి నెట్టేస్తాయి .. మరింత బలహీన పరుస్తాయి.
సెకండాఫ్ లో గాడి తప్పిన కథ .. గతుకుల మార్గంలోనే ప్రయాణం చేస్తూ చివరికి తారు రోడ్డు మీదకి వస్తుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ బాగానే ఉన్నాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. కాకపోతే గాడి తప్పిన కథతో .. అంతగా అవసరం లేని సన్నివేశాలతో కథ ఎక్కువ దూరం ప్రయాణం చేస్తూ రావడం వలన ప్రేక్షకులకు అసహనం కలుగుతుంది.
ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర భూమికనే. ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఆమె నటనకి వంక బెట్టనవసరం లేదు. ఇక ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ సారా అర్జున్ అనే చెప్పాలి. సహజమైన ఆమె నటన ఆకట్టుకుంటుంది. కొత్త కుర్రాళ్లు కూడా ఎక్కడా తడబడకుండా చేశారు. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలు గౌతమ్ మీనన్ కి కొట్టిన పిండి అని చెప్పవలసిన పని లేదు. ప్రవీణ్ కె పోతన్ ఫొటోగ్రఫీ బాగుంది. కాలభైరవ సంగీతంలో హోరు ఎక్కువగా వినిపించింది. సాహిత్యం అర్థంకాని పరిస్థితి. సన్నివేశాలలోని సందర్భానికి మించిన హోరు ఇబ్బంది పెడుతుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఫరవాలేదు.
గోడకి అవతల వైపున మాత్రమే కాదు ఇవతల వైపున కూడా నేరస్థులు ఉన్నారు. మైనర్లు చేసే తప్పులకు బాధ్యులు వారి తల్లిదండ్రులే. పిల్లలు అడిగినదానికి మించి అవసరాలు తీర్చడమంటే వాళ్లను స్వయంగా చెడగొట్టడమే అనే అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను ఆవిష్కరించాడు. ఒక మంచి ఉద్దేశం కోసం .. ప్రయోజనం కోసం గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ ప్రయత్నంలో కొన్ని సన్నివేశాలు ఆయన చేజారిపోయాయి .. మరికొన్ని పట్టుతప్పి పక్కకిపోయాయి.
తన మార్క్ కనిపించకుండా ఈ సినిమాను తెరకెక్కించాలని గుణశేఖర్ అనుకుని ఉంటారు. ఈ విషయంలో ఆయన కొంతవరకూ సక్సెస్ అయ్యారు. ఒక సందేశాత్మక చిత్రం ద్వారా ఆలోచింపజేయడం ఎంత అవసరమో .. వినోదాన్ని అందించడం కూడా అంతే అవసరం. అలాంటి వినోదమే ఈ సినిమాలో కొరవడింది. వినోదానికి అవకాశం లేకపోయినా, ఉన్న కంటెంట్ అయినా పర్ఫెక్ట్ గా ఉందా అంటే, అది అటూ ఇటూ పరిగెడుతూ అక్కడక్కడా బలహీనపడుతూ ఇబ్బంది పెడుతుంది. సెకండాఫ్ ను మరింత పట్టుగా రాసుకుని ఉంటే, ప్రధానమైన కథలో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటే తప్పకుండా ఇది మరింత బెటర్ అవుట్ పుట్ ను రాబట్టేదేమో అనిపిస్తుంది.

Movie Details
Movie Name: Euphoria
Release Date: 2026-02-06
Cast: Bhumika, Sara Arjun, Gowtham Menon, Vighnesh Gavireddy. Likhitha
Director: Gunasekhar
Producer: Neelima Guna - Yuktha Guna
Music: Kalabhairava
Banner: Guna Handmade Films
Review By: Peddinti
Trailer