టీడీపీ యాత్రపై ప్రధాని ప్రశంసలు.. కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్
- ప్రధానికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్
- తిరుపతి నుంచి కాశీకి కృష్ణా, గోదావరి జలాలతో బైక్ యాత్ర
- ప్రభుత్వాధినేతగా మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ 'సేవా సంకల్ప యాత్ర'
- మీ మాటలు కార్యకర్తలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్న లోకేశ్
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన 'సేవా సంకల్ప యాత్ర'ను ప్రశంసించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని అందించిన ప్రోత్సాహకర వ్యాఖ్యలు తమ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లోకేశ్ తన పోస్టులో.. "ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారూ. గత 25 ఏళ్లుగా మీరు అందిస్తున్న నిరంతర సేవలు, సుపరిపాలనకు నివాళిగా ఈ యాత్రను ఒక చిన్న కానుకగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీ క్షేత్రానికి తీసుకెళ్లడం మాకు దక్కిన అరుదైన గౌరవం. ఇది మన ప్రజలు, సంప్రదాయాలు, దేశాన్ని ఏకం చేసే బంధాలను చాటిచెబుతోంది. ఈ యాత్రలో పాలుపంచుకున్న ప్రతి కార్యకర్తకు మీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి" అని వివరించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేత బాధ్యతల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ ఈ 'సేవా సంకల్ప యాత్ర'ను నిర్వహించింది. ఇందులో భాగంగా టీడీపీ శ్రేణులు తిరుపతి నుంచి కాశీ వరకు సుమారు 2,000 కిలోమీటర్ల మేర బైక్ యాత్రను చేపట్టాయి. ఏపీలోని కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను సేకరించి, కాశీ విశ్వనాథునికి జలాభిషేకం నిర్వహించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం.
అంతకుముందు ఈ యాత్రపై ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. ఏపీ నుంచి నదీ జలాలను సేకరించి తీసుకురావడం తనను ఎంతో కదిలించిందని పేర్కొన్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసిన టీడీపీ నేతలను, కార్యకర్తలను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.