పోర్టు ఆధారిత అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఒకేసారి 28 ప్రాజెక్టులు.. 20,000 ఉద్యోగాలు
- రూ.22,177 కోట్ల విలువైన 28 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం
- ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 19,739 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు
- ఏపీని హార్డ్‌వేర్, పోర్టు ఆధారిత పారిశ్రామిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం
- ఎగుమతుల ర్యాంకింగ్‌లో దేశంలోనే 10వ స్థానంలో నిలిచిన తిరుపతి జిల్లా
- ఆమోదం పొందిన ప్రాజెక్టులను 6 నెలల్లో ప్రారంభించాలని సీఎం ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 21వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో రూ.22,177.84 కోట్ల విలువైన 28 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో కొత్తగా 19,739 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన, ఐటీ, ఆహార శుద్ధి, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన ఈ ప్రతిపాదనలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
హార్డ్‌వేర్, పోర్టు ఆధారిత అభివృద్ధిపై ఫోకస్
ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు రెండు ప్రధాన లక్ష్యాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని దేశంలోనే కీలకమైన హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా (హబ్) తీర్చిదిద్దడంతో పాటు, తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత పారిశ్రామిక వ్యవస్థను (ఎకో సిస్టమ్) నిర్మించాలని ఆదేశించారు. సెమీ కండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి ఎలక్ట్రానిక్స్ హబ్‌లలో పరిశోధన, డిజైన్, తయారీతో కూడిన పూర్తిస్థాయి ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ రంగాల్లో పెట్టుబడుల కోసం తైవాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
నైపుణ్యాభివృద్ధి, ఎగుమతులే లక్ష్యం
రాష్ట్రంలోని యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 10వ తరగతి నుంచే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు స్కిల్ మ్యాపింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. శ్రీసిటీ వంటి పారిశ్రామిక కేంద్రాల వల్ల తిరుపతి జిల్లా ఎగుమతుల ర్యాంకింగ్‌లో దేశంలోనే 10వ స్థానంలో, తూర్పుగోదావరి 12వ స్థానంలో నిలిచాయని, వీటిని టాప్-5కి తీసుకురావడమే లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వీటితో పాటు రేర్ ఎర్త్ మినరల్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఆమోదం పొందిన ప్రాజెక్టులను కేవలం ఆరు నెలల వ్యవధిలో ప్రారంభించేలా పర్యవేక్షించాలని అధికారులకు గడువు విధించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి. నారాయణ, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎస్ఐపీబీ ఆమోదం పొందిన 28 ప్రాజెక్టుల పూర్తి వివరాలు:
1.క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కడప జిల్లా – రూ.950 కోట్ల పెట్టుబడి – 90 ఉద్యోగాలు.
2.సాయి బయోఎనర్జీ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ లిమిటెడ్ – నంద్యాల జిల్లా – రూ.168.56 కోట్లు – 600 ఉద్యోగాలు.
3.ఎం. వెంకటరావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (MVR టెర్రావాంట్ JV) – శ్రీ సత్యసాయి జిల్లా – రూ.3,078 కోట్లు – 1,300 ఉద్యోగాలు.
4.రిజాల్వెన్ టూ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ – కర్నూలు – రూ.980 కోట్లు – 250 ఉద్యోగాలు.
5.ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ – విశాఖపట్నం – రూ.100 కోట్లు – 2,400 ఉద్యోగాలు.
6.డెలాయిట్ – విశాఖపట్నం – రూ.43.75 కోట్లు – 2,500 ఉద్యోగాలు.
7.ఫోటాన్‌కోర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – రూ.9 కోట్లు – 45 ఉద్యోగాలు.
8.వెరిడాటా హెల్త్ ఇంక్. – అమరావతి – రూ.4.5 కోట్లు – 50 ఉద్యోగాలు.
9.క్వాన్ఫ్లుయెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – రూ.5 కోట్లు – 30 ఉద్యోగాలు.
10. ట్రైక్వాంటా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – రూ.35 కోట్లు – 175 ఉద్యోగాలు.
11. క్వాంటమ్ కోడాన్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – రూ.167 కోట్లు – 126 ఉద్యోగాలు.
12. శ్రిష్టి క్వాంటమ్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – రూ.100 కోట్లు – 110 ఉద్యోగాలు.
13. ఆరోహక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ – అమరావతి – రూ.62 కోట్లు – 300 ఉద్యోగాలు.
14. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ – మచిలీపట్నం – రూ.8,000 కోట్లు – 8,000 ఉద్యోగాలు (3,000 ప్రత్యక్ష, 5,000 పరోక్ష).
15. మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ – పల్నాడు – రూ.3,000 కోట్లు – 2,000 ఉద్యోగాలు.
16. క్యాటర్‌పిల్లర్ ఇంక్. – శ్రీసిటీ, తిరుపతి – రూ.150 కోట్లు – 80 ఉద్యోగాలు.
17. ఎంఏఎఫ్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ – కుప్పం, చిత్తూరు – రూ.215 కోట్లు – 2,560 ఉద్యోగాలు.
18. దాల్మియా సిమెంట్ – కడప – రూ.395.23 కోట్లు.
19. అగర్వాల్ ఫౌండ్రీస్ – నెల్లూరు – రూ.549 కోట్లు – 245 ఉద్యోగాలు.
20. శ్రీ వైభవ లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ – నెల్లూరు – రూ.222.63 కోట్లు – 300 ఉద్యోగాలు.
21. శ్రీ వసుధ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ – అనంతపురం – రూ.254.06 కోట్లు – 350 ఉద్యోగాలు.
22. రావోక్స్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – చిత్తూరు – రూ.1,388.14 కోట్లు – 1,000 ఉద్యోగాలు.
23. కెల్లాగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – శ్రీ సిటీ, సత్యవేడు – రూ.211.70 కోట్లు – 30 ఉద్యోగాలు.
24. ఎపిటోమ్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ – నెల్లూరు – రూ.530.65 కోట్లు – 238 ఉద్యోగాలు.
25. హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ – విజయనగరం, తిరుపతి – రూ.1,127 కోట్లు – 195 ఉద్యోగాలు.
26. గ్రాండ్ తిరుపతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – తిరుపతి – రూ.188.11 కోట్లు – 851 ఉద్యోగాలు.
27. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ – అమరావతి – రూ.167 కోట్లు – 600 ఉద్యోగాలు.
28. జేఎల్ అసోసియేట్స్ – కడప – రూ.53.25 కోట్లు – 314 ఉద్యోగాలు.