దుగరాజపట్నంలో భారీ షిప్‌యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడి!
- దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్
- ఎండీఎల్‌తో ఏపీ ప్రభుత్వ ఎంవోయూ
- ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి
- 45 వేల మందికి ఉపాధి అవకాశాలు
- ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల సామర్థ్యం
ఆంధ్రప్రదేశ్‌లో షిప్‌బిల్డింగ్ రంగానికి భారీ ఊతం లభించనుంది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు చేసేందుకు ‘మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్’ (ఎండీఎల్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సచివాలయంలో ఎండీఎల్, ‘నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్-ఏపీ’ (ఎన్‌ఎస్‌హెచ్‌ఐపీ-ఏపీ) మధ్య ఎంవోయూ జరిగింది.
వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుపై ఎండీఎల్ సుమారు రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్‌బిల్డింగ్‌తో పాటు మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ప్రతిపాదిత షిప్‌యార్డ్ ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల నౌకల నిర్మాణ సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్ఎన్జీ క్యారియర్లు, భారీ ప్రత్యేక నౌకలను ఇక్కడ నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది.
దుగరాజపట్నంలో షిప్‌బిల్డింగ్-కమ్-పోర్ట్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ యార్డ్‌కు సుమారు రూ.29,254 కోట్లు, పోర్టు అభివృద్ధికి రూ.9,513 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.