అంతా అయిపోయింది... అసెంబ్లీలో స్టాలిన్‌ను అనుకరించిన ముఖ్యమంత్రి విజయ్

Chief Minister Vijay imitates Stalin in the Assembly
  • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై తీవ్ర వాగ్వాదం
  • డీఎంకేపై తీవ్ర ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి విజయ్
  • స్టాలిన్ మేనరిజంను అనుకరించి చూపించిన విజయ్
  • ముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేల వాకౌట్
  • అవినీతి కేసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి
తమిళనాడు శాసనసభ మంగళవారం నాటి సమావేశాల్లో తీవ్ర వాదోపవాదాలు, నాటకీయ పరిణామాల మధ్య అట్టుడికింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష డీఎంకే మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, డీఎంకే పార్టీ పేరుతో అక్రమంగా నిధులు సేకరిస్తోందని ఆరోపించడంతో పాటు, అవినీతికి పాల్పడిన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో వాస్తవం లేదని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన విమర్శించారు. విజయ్ ప్రసంగానికి డీఎంకే సభ్యులు పదేపదే అడ్డుతగలడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, డీఎంకే సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఇదే సమయంలో విజయ్ తన ప్రసంగంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను అనుకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో సీట్ల పంపకాల చర్చల సందర్భంగా "అంతా సెటిల్ అయిపోయింది" అనేలా స్టాలిన్ ప్రదర్శించిన మేనరిజంను విజయ్ అసెంబ్లీలో అనుకరించి చూపించారు. దీంతో అధికార పక్ష సభ్యులు చప్పట్లతో సభ హోరెత్తింది.

తమ ప్రభుత్వం సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడాన్ని ఈ సందర్భంగా విజయ్ సమర్థించుకున్నారు. ప్రజాధనాన్ని దోచుకునే ప్రసక్తే లేదని, మహిళల భద్రతతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Joseph Vijay
MK Stalin
Tamil Nadu Assembly
DMK Walkout
Tamil Nadu Politics
Assembly Session

More Telugu News