అరెస్ట్ చేస్తే అమర్‌నాథ్ ఇంకా పెద్ద నేత అవుతాడు: పవన్ పాత వీడియోలతో పేర్ని నాని కౌంటర్

Perni Nani counters with old videos of Pawan Kalyan saying Amarnath will become a bigger leader if arrested
  • అమర్‌నాథ్‌పై 10 నుంచి 15 కేసులు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారన్న పేర్ని నాని
  • అనిత కట్టుబొట్టు గురించి అమర్‌నాథ్‌ ఎక్కడ మాట్లాడారని ప్రశ్న
  • పదవి వచ్చాకే పవన్‌కు సంస్కారం గుర్తొచ్చిందా అని ప్రశ్న

మంత్రి వంగలపూడి అనిత, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్‌లో... ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇష్యూపై ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన, కూటమి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో పవన్ కల్యాణ్, ఇతర టీడీపీ నేతలు మాట్లాడిన పాత వీడియోలను స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ రివర్స్ అటాక్ చేశారు.


గతంలో పవన్ కల్యాణ్... "ఆడ కాదు మగ కాదు.. ఒక్కొక్కరిని తొక్కిపట్టి నారతీస్తా.. కొడకల్లారా" అంటూ మాట్లాడిన వీడియోలను పేర్ని నాని ప్రదర్శించారు. "మేమంతా పవన్ కల్యాణ్ కొడుకులమా? మరి ఆయన మాట్లాడింది సంస్కారవంతమైన భాషేనా?" అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చాకే పవన్‌కు సంస్కారం గుర్తొచ్చిందా అని నిలదీశారు.


అమర్‌నాథ్‌పై 10 నుండి 15 కేసులు పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని, కానీ అరెస్ట్‌లకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. అరెస్ట్ చేస్తే అమర్‌నాథ్ ఇంకా పెద్ద లీడర్ అవుతాడే తప్ప వచ్చే నష్టమేమీ లేదన్నారు. అసలు హోంమంత్రి కట్టుబొట్టు గురించి అమర్‌నాథ్ ఎక్కడ మాట్లాడారని పేర్ని నాని ప్రశ్నించారు. ఆంధ్రాలో ఒక తల్లి తన కొడుకు కనిపించడం లేదని ఏడుస్తున్నా పట్టించుకోని పవన్ కల్యాణ్‌... తెలంగాణలో ఎవరో అనారోగ్యంతో ఉంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లారని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Perni Nani
Pawan Kalyan
Gudivada Amarnath
Vangalapudi Anita
Andhra Pradesh Politics
YSRCP vs Janasena

More Telugu News