ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

CM Revanth Reddy meets PM Modi in Delhi
  • నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ప్రత్యేక సమావేశం
  • తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ
  • వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో జరిగిన నీతి ఆయోగ్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం వీరిద్దరి మధ్య ఈ ప్రత్యేక భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో 'వికసిత్ భారత్ 2047' లక్ష్యంతో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాలు పెంపు, ఉపాధి కల్పన, ఆరోగ్యం వంటి అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

Go Back to Shorts
Revanth Reddy
Narendra Modi
Telangana Development
NITI Aayog Meeting
New Delhi
Viksit Bharat 2047

More Telugu News