'పెద్ది' చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్
Add ap7am to your home Screen

'పెద్ది' చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్

Ram Charan Peddhi Movie Faces Social Media Trolls FIR Filed
  • కొన్ని వారాలుగా చిత్రంపై నెగిటివ్ ప్రచారం జరుగుతున్నట్లు గుర్తించిన యూనిట్
  • హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్
  • ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాల ద్వారా నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్లు గుర్తింపు
రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' చిత్రంపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని ఆరోపిస్తూ చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వచ్చే వారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ గుర్తించింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. పలు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల ద్వారా నెగిటివ్ ప్రచారం చేస్తున్నవారిని గుర్తించారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

సోషల్ మీడియాలో కొన్ని వారాలుగా 'పెద్ది' చిత్రంపై ప్రతికూల ప్రచారం జరుగుతుండటంతో చిత్ర యూనిట్ ఆయా ఖాతాల ఆన్‌లైన్ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తోంది. పదేపదే జరుగుతోన్న ఆర్గనైజ్డ్ ట్రోలింగ్ ఘటనల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు 'పెద్ది' సినిమా సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Ram Charan
Peddhi Movie
Ram Charan Movie
Social Media Trolls
Movie Promotion
FIR Filed
Hyderabad

More Telugu News