ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు సూర్యవంశీకి గవాస్కర్ మూడు ముక్కల సందేశం!
- గవాస్కర్ ఆశీస్సులు తీసుకున్న వైభవ్
- ‘ఇలాగే కొనసాగించు’ అని గవాస్కర్ సూచన
- వైభవ్ టీ20 అరంగేట్రానికి మద్దతు
- వయసుతో సంబంధం లేదన్న సన్నీ
- ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచన
గవాస్కర్ సందేశం
పెద్దల పట్ల వైభవ్ చూపిన గౌరవానికి ఫిదా అయిన సునీల్ గవాస్కర్ అతనికి ఇచ్చిన సందేశాన్ని వెల్లడించారు. ‘‘వైభవ్ నా పాదాలను తాకినప్పుడు నేను అతనితో కేవలం ‘లగే రహో బేటే, లగే రహో’ (ఇలాగే కొనసాగించు నాన్నా) అని మాత్రమే చెప్పాను’’ అని తెలిపారు. ఒకవేళ తాను కూడా అతనితో కలిసి మైదానంలో బ్యాటింగ్ చేస్తూ అవతలి ఎండ్‌లో ఉన్నా ఇదే మాట చెప్పేవాణ్నని సన్నీ వివరించారు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ 12 సిక్సర్లు బాది ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు.
టీ20 జట్టులోకి
ఈ అద్భుత ప్రదర్శన తర్వాత వైభవ్‌కు గవాస్కర్ పూర్తి మద్దతుగా నిలిచారు. 2026 వైభవ్ సూర్యవంశీ సంవత్సరంగా గుర్తుండిపోతుందని ప్రశంసించారు. ఇంగ్లండ్‌తో జరగబోయే తదుపరి టీ20 సిరీస్‌కు అగణ్ని భారత జట్టుకు ఎంపిక చేయాలని సెలక్టర్లను సూచించారు. 15 ఏళ్ల వయసున్న ఈ కుర్రాడు అంతర్జాతీయ స్థాయిలో 15 ఏళ్ల అనుభవం ఉన్న బౌలర్లను సైతం భయం లేకుండా ఎదుర్కొంటున్నాడని, కాబట్టి అతనికి జట్టులో అవకాశం ఇవ్వడానికి వయసుతో అస్సలు సంబంధం లేదని స్పష్టం చేశారు.