నా పర్సనల్ లైఫ్ మీకెందుకు?.. క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడండి: కామెంటేటర్లపై రియాన్ పరాగ్ ఫైర్
- ఐపీఎల్ కామెంటేటర్లపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర వ్యాఖ్యలు
- ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడవద్దని వ్యాఖ్యాతలకు హితవు
- తామూ మనుషులమే, తప్పులు జరుగుతాయని వ్యాఖ్య
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలిపిన కీలక మ్యాచ్ అనంతరం, కెప్టెన్ రియాన్ పరాగ్ కామెంటేటర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని, కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడాలని వ్యాఖ్యాతలకు సూచించాడు.
ఇటీవల 'వేపింగ్ వివాదం'లో చిక్కుకున్న పరాగ్‌ను... తనపై వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కొంటారని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. "నేను ఏం చేసినా ప్రజలు మాట్లాడతారని నాకు అర్థమైంది. కానీ, బయట జరిగే చర్చలు నా ఆటతీరును, మానసిక స్థితిని ప్రభావితం చేయకూడదు. కీబోర్డ్ వారియర్స్ చేసే కామెంట్లు బయటి విషయాలు, వాటిని అక్కడే వదిలేయాలి" అని స్పష్టం చేశాడు.
కొంతమంది నిపుణులు, కామెంటేటర్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని పరాగ్ ఆరోపించాడు. "జట్టు 75 లేదా 80 పరుగులకు ఆలౌటైతే, వారికి ఆడటం ఇష్టం లేదని, ఆడటం చేతకాదని చెప్పడం చాలా సులభం. కానీ, దాని వెనుక మూడు, నాలుగు రోజుల కఠోర శ్రమ ఉంటుంది. మేం కూడా మనుషులమే, మా వైపు నుంచి కూడా తప్పులు జరుగుతాయి" అని అన్నాడు.
"కామెంటేటర్లకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. దయచేసి క్రికెట్‌ను ప్రేమించండి, క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడండి. దేశానికి ఎంతో ముఖ్యమైన ఈ ఆటకు కొంత గౌరవం ఇవ్వాలి. అంతేగానీ ఇతర అనవసర విషయాల గురించి మాట్లాడొద్దు" అని పరాగ్ కోరాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అటు ఎల్ఎస్జీతో మ్యాచ్‌లో 38 బంతుల్లో 93 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పరాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, లక్నోపై విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై తప్పక గెలవాల్సి ఉంది.