ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. గిల్‌కు కెప్టెన్సీ, కొత్త ముఖాలకు చోటు!
- జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్ సిరీస్
- కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక
- రోహిత్, హార్దిక్‌ల ఎంపికకు ఫిట్‌నెస్ మెలిక
- హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌లకు తొలిసారి పిలుపు
- సీనియర్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి
జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్థాన్ తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ టూర్‌లో టెస్ట్‌తో పాటు వన్డే జట్టుకు కెప్టెన్‌గా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. టెస్ట్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు, వన్డే జట్లకు రెండింటికీ ఎంపికయ్యాడు.
వన్డే జట్టులోకి శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడమే కాకుండా వైస్ కెప్టెన్ బాధ్యతలనూ దక్కించుకున్నాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని వన్డే జట్టుకు ఎంపిక చేశారు. అయితే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎంపిక వారి ఫిట్‌నెస్ ఆధారంగానే ఖరారవుతుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఈ సిరీస్ ద్వారా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేయనుండగా.. ప్రిన్స్ యాదవ్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. మానవ్ సుతార్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు.
వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ (ఫిట్‌నెస్ ఆధారంగా), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా (ఫిట్‌నెస్ ఆధారంగా), ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, గుర్నూర్ బ్రార్
టెస్ట్ జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్