'రాంబుజ్జి'కి హాయ్ చెప్పండి... 'పెద్ది' నుంచి మరో గ్లింప్స్ వీడియో రిలీజ్
- రామ్ చరణ్ 'పెద్ది'లో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు
- 'రాంబుజ్జి'గా ఎంట్రీ ఇవ్వనున్న 'మిర్జాపూర్' ఫేమ్ దివ్యేందు
- మే 18న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటన
- జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి చిత్రబృందం కీలక అప్డేట్ను విడుదల చేసింది. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ఈ కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రంలో 'రాంబుజ్జి' అనే శక్తివంతమైన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ నటిస్తుండడం తెలిసిందే. తాజాగా ఈ పాత్రకు సంబంధించి గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. "రాంబుజ్జికి హాయ్ చెప్పండి" అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దివ్యేందు 'పెద్ది'లో తనదైన శైలిలో నటించినట్టు గ్లింప్స్ చెబుతోంది. “ఇక అసలు ఆట మొదలవ్వబోతోంది” అంటూ చిత్రబృందం పోస్ట్ చేయడంతో ప్రమోషన్స్‌లో వేగం పుంజుకుంది. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వేసవి కానుకగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యే ఈ సినిమా కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.