మోదీ పిలుపు... కేవలం 4 వాహనాల కాన్వాయ్ తో సచివాలయానికి వచ్చిన చంద్రబాబు

Chandrababu Naidu Responds to Modis Call Reduces Convoy to 4 Vehicles
  • ప్రధాని మోదీ పిలుపుతో స్పందించిన సీఎం చంద్రబాబు
  • 12 నుంచి 4 వాహనాలకు తన కాన్వాయ్‌ కుదింపు
  • నేటి నుంచే కుదించిన కాన్వాయ్‌ను అమలు చేసిన ముఖ్యమంత్రి
  • ఇంధనం ఆదా చేయాలని మంత్రులకు, ప్రజాప్రతినిధులకు సూచన
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వాహన శ్రేణిని భారీగా తగ్గించుకున్నారు. తన కాన్వాయ్‌లో ఉండే 12 వాహనాలను కేవలం 4 వాహనాలకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చిన ఆయన, ఈరోజు ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు.

గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే బయలుదేరారు. ఇకపై తన ప్రయాణాలన్నింటికీ ఈ కుదించిన కాన్వాయ్‌నే వినియోగించాలని ఆయన నిర్ణయించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా తమ వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని, తద్వారా ప్రజాధనం వృథాను అరికట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనతో పలువురు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నట్లు సమాచారం. 
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Narendra Modi
AP Secretariat
Convoy reduction
Fuel saving
Cabinet meeting
Public funds
Andhra Pradesh Ministers

More Telugu News