త్వరలో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ఎస్ఐఆర్': ఎన్నికల సంఘం

Election Commission to Start Voter List Revision in 17 States
  • ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా వివిధ కారణాలతో తాత్కాలిక బ్రేక్
  • 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల ఓటర్ల 'ఎస్ఐఆర్' ప్రక్రియ పూర్తి
  • మిగిలిన 40 కోట్ల ఓటర్ల 'ఎస్ఐఆర్' ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడి
రాబోయే కొద్దిరోజుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) మూడవ దశను ప్రారంభిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 40 కోట్ల మంది ఓటర్లను కవర్ చేస్తూ, మిగిలిన 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ఎస్ఐఆర్' ఉంటుందని వెల్లడించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో 'ఎస్ఐఆర్' ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మూడో దశకు సమాయత్తమవుతుంది.

ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబర్ దీవులు, లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, బీహార్ రాష్ట్రాలలో 'ఎస్ఐఆర్' చేపట్టారు. అసోంలోనూ ప్రత్యేక సవరణ కార్యక్రమం జరిగింది. మొత్తం దేశంలోని 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల ఓటర్లకు సంబంధించిన 'ఎస్ఐఆర్' ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

వాస్తవానికి, ఏప్రిల్ నుంచి సర్ ప్రక్రియ చేపట్టనున్నట్లు పై రాష్ట్రాలకు ఫిబ్రవరి 19వ తేదీన ఈసీ లేఖ రాసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా వివిధ కారణాల వల్ల బ్రేక్ పడింది. వాటితో పాటు ఎస్ఐఆర్‌పై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్ళడం కూడా జాప్యానికి కారణమైంది.
Go Back to Shorts
Election Commission of India
Voter List Revision
Special Summary Revision
India Elections
ECI

More Telugu News