"తమిళనాడు సీఎం విజయ్": 'జననాయగన్' టైటిల్ కార్డు వీడియో వైరల్!
- టైటిల్ కార్డుపై 'ముఖ్యమంత్రి విజయ్' అంటూ సోషల్ మీడియాలో సందడి
- విజయ్ అభిమానులను అలరిస్తున్న ఏఐ వీడియో
- ఇంకా విడుదల కాని జన నాయగన్
తమిళ సూపర్ స్టార్, రాజకీయ సంచలనం దళపతి విజయ్ అభిమానులకు 'జననాయగన్' సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల ఆలస్యమైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే 108 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 118 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, ఇప్పటికే కాంగ్రెస్ అండగా నిలవడంతో విజయ్‌కి మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య 113కు చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై తమిళనాట తర్జన భర్జన కొనసాగుతోంది.
ప్రభుత్వం ఏర్పాటు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న తరుణంలో, విజయ్ అభిమానులను ఉత్సాపరిచే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 'జననాయగన్' టైటిల్ కార్డుపై దళపతి విజయ్ అని కాకుండా, 'ముఖ్యమంత్రి విజయ్' అంటూ వేసి అభిమానుల్లో ఈ క్లిప్ సంతోషాన్ని నింపింది.
వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో "తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్" అని పరిచయం చేయగా, థియేటర్‌లో ప్రేక్షకులు కేకలు వేస్తూ సంబరాల్లో మునిగిపోయినట్లు ఉంది. తొలుత దీనిని అధికారిక అప్‌డేట్‌గా భావించారు. ఈ క్లిప్‌ను 'ఏఐ' ద్వారా అభిమానులు ఎడిట్ చేసినదిగా తెలుస్తోంది. ఏదైనప్పటికీ, విజయ్ అభిమానుల్లో మాత్రం ఈ క్లిప్ ఎనలేని సంతోషాన్ని నింపుతోంది.
కాగా, విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ జనవరిలో పొంగల్ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ కారణాలతో విడుదల నిలిచిపోయింది. విజయ్ అధికార పీఠం ఎక్కాక జన నాయగన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.