ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
Add ap7am to your home Screen

ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

Donald Trump warns Iran
  • కాల్పుల విరమణ పొడిగించడం ఇష్టంలేదన్న ట్రంప్
  • ఇరాన్‌కు చర్చలు తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్య
  • విరామ సమయంలో అదనపు ఆయుధాలను సమకూర్చుకుంటామని వెల్లడి
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాల్పుల విరమణను పొడిగించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌కు చర్చలు తప్ప మరో మార్గం లేదని, ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. చర్చల నేపథ్యంలో, ఈ విరామ సమయాన్ని వినియోగించుకుని అమెరికా సైన్యం అదనపు ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటుందని ఆయన తెలిపారు.

ఇరాన్‌పై దాడులు తిరిగి ప్రారంభించేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని, తాను ఆదేశిస్తే అదే జరుగుతుందని హెచ్చరించారు. తదుపరి చర్చల్లో పురోగతి కనిపిస్తే కాల్పుల విరమణను కొనసాగిస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కాల్పుల విరమణ కొనసాగించాలనుకోవడం లేదని అన్నారు. తమకు అంత సమయం కూడా లేదని తెలిపారు. కాగా, కాల్పుల విరమణ నేడో, రేపో ముగియనుంది.
Advertisement
Donald Trump warns Iran
Donald trump on ceasefire

More Telugu News