ధురంధర్ చిత్రం ద్వారా బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన డైలాగ్ ఇదే!

rakesh bedi comment on dhurandhar 3 dialogue
  • ధురంధర్ 3 సీక్వెల్ రాకపోవచ్చన్న నటుడు రాకేశ్ బేడీ వ్యాఖ్య
  • సినిమా భారీ విజయం సాధించినా మూడో భాగంపై అనుమానం
  • తన 'బచ్చా హై తూ మేరా' డైలాగ్ వైరల్ కావడంపై స్పందన
బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన "ధురంధర్ 2: ది రివెంజ్" చిత్రానికి మూడో భాగం వస్తుందా లేదా అనే ఉత్కంఠకు తెరదించుతూ, ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేశ్ బేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. "ధురంధర్ 3" వచ్చే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

"ధురంధర్" ఫ్రాంచైజీలో పాకిస్థానీ రాజకీయ నాయకుడు జమీల్ జమాలి పాత్రలో రాకేశ్ బేడీ నటనకు విశేషమైన గుర్తింపు లభించింది. ముఖ్యంగా, ఆయన చెప్పిన "బచ్చా హై తూ మేరా" డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై ఆయన స్పందిస్తూ, "నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ ఆ డైలాగ్ చెప్పమని అడుగుతున్నారు. ఎదుటి వ్యక్తి నా కన్నా పెద్దవాడైనా, జుట్టు లేకపోయినా నేను 'బచ్చా హై తూ మేరా' అని చెప్పాల్సి వస్తోంది," అని సరదాగా వ్యాఖ్యానించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'ధురంధర్ 3' గురించి రాకేశ్ బేడీ మాట్లాడుతూ, "మూడో భాగం వస్తుందని నేను అనుకోవడం లేదు. అయితే, ధురంధర్ అనేది ఒక పెద్ద ఫ్రాంచైజీ. భవిష్యత్తులో వేరే నటీనటులతో దీనిని కొనసాగించే అవకాశం ఉంది," అని స్పష్టం చేశారు.
 
 
Advertisement
rakesh bedi
movi news
entertainment
dhurandhar-3

More Telugu News