డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టం చేసింది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టం చేసింది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Aleti Maheshwar Reddy says Congress made law for population based delimitation
  • దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే మేం 50 శాతం సీట్ల పెంపును అమలు చేస్తున్నామని వెల్లడి
  • 1972లో కాంగ్రెస్ డీలిమిటేషన్ వల్ల ఏపీకి 1 లోక్ సభ సీటు తగ్గిందని విమర్శ
  • డీలిమిటేషన్ తర్వాత మహిళలకు 270కి పైగా సీట్లు వస్తాయన్న మహేశ్వర్ రెడ్డి
డీలిమిటేషన్ బిల్లుతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విమర్శలపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వాలే చట్టాలు తెచ్చాయని అన్నారు. 1972లో కాంగ్రెస్ చేసిన డీలిమిటేషన్ వల్ల నాడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక లోక్ సభ సీటు తగ్గిందని గుర్తు చేశారు.

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సీట్ల ప్రకారమైతే మహిళలకు 170 సీట్లు వస్తాయని, డీలిమిటేషన్ తర్వాత అయితే 270కి పైగా సీట్లు వస్తాయని తెలిపారు.
Advertisement
Aleti Maheshwar Reddy
BJP
Telangana
Delimitation Bill
Congress
BRS
South India
Lok Sabha seats

More Telugu News