తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఎవరీ ప్రఫుల్ హింగే?

Who Is Praful Hinge Sunrisers Hyderabad Pacer Who get 3 Wickets on his First Over
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) యువ పేసర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తను వేసిన మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఆ ఓవర్‌లోని రెండో బంతికి వైభవ్ సూర్యవంశీని, నాలుగో బంతికి ధ్రువ్ జురెల్‌ను, ఆఖరి బంతికి ప్రిటోరియస్‌ను ఔట్ చేసి హింగే అద్భుతం చేశాడు.

అలాగే, తన రెండో ఓవర్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను కూడా పెవిలియన్ పంపాడు. కొంతకాలంగా బౌలింగ్ సమస్యలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ జట్టు, ఈ యువ బౌలర్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. అరంగేట్రంలోనే ఇలాంటి ప్రదర్శనతో హింగే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఎవరీ ప్రఫుల్ హింగే?
ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ iplt20.com కథనం ప్రకారం ప్రఫుల్ హింగే విదర్భకు చెందిన 24 ఏళ్ల యువ రైట్ ఆర్మ్ సీమర్. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మంచి పేరు సంపాదించాడు. కేవలం 10 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 26.7 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. బ్యాకప్ పేస్ బౌలర్‌గా జట్టులోకి వచ్చిన హింగే, తన తొలి అవకాశంలోనే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక‌, ఈ సీజ‌న్‌లో బౌలింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ కు ఈ యువ పేస‌ర్ అరంగేట్రంలోనే అద‌ర‌గొట్ట‌డం భారీ ఊరటను ఇచ్చింది.  
Go Back to Shorts
Praful Hinge
Sunrisers Hyderabad
SRH
IPL 2024
Rajasthan Royals
Vaibhav Suryavanshi
Dhruv Jurel
Riyan Parag
Vidarbha cricket

More Telugu News