హర్మూజ్ గుండా వెళ్లే భారత నౌకలకు టోల్ ఫీజు లేదు: ఇరాన్ రాయబారి
- ఇరాన్, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న మహమ్మద్ ఫతాలీ
- తమ డిమాండ్లకు అమెరికా అంగీకరిస్తేనే చర్చలు అన్న ఫతాలీ
- ఇరాన్ సామర్థ్యం గురించి అమెరికాకు తెలుసని వ్యాఖ్య
అమెరికాతో చర్చలు పునఃప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ తమ డిమాండ్లకు అనుకూలంగా స్పందించాలని స్పష్టం చేశారు. మా షరతులను అమెరికా అంగీకరిస్తే, మరో విడత చర్చలు సాధ్యమవుతాయని అన్నారు. ఇటీవల తాత్కాలిక యుద్ధ విరమణ అనంతరం చర్చల సందర్భంగా అమెరికా అంగీకార యోగ్యం కాని డిమాండ్లు తమ ముందు ఉంచిందని పేర్కొన్నారు. అందుకే చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని అన్నారు.
ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై మహమ్మద్ ఫతాలీ స్పందిస్తూ, ఇరాన్ సామర్థ్యం గురించి వాషింగ్టన్‌కు తెలుసని అన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో, భారత్, ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.