కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలి: రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh Warns Pakistan on Targeting Kolkata
  • కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్
  • 55 ఏళ్ల క్రితం జరిగిన విషయం గుర్తుంచుకోవాలని సూచన
  • పాకిస్థాన్ ఉద్రిక్తలు పెంచే ప్రకటనలు చేయవద్దని హితవు
కోల్‌కతాను, పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుంటే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పొరుగు దేశాలు భారత్‌పై దుస్సాహసానికి పాల్పడవద్దని కొన్ని రోజుల క్రితం ఆయన హెచ్చరించారు. దీనితో భారత్ ఏమైనా దాడులకు పాల్పడితే కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు.

ఆయన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బెంగాల్‌లో ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ, పాకిస్థాన్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. 55 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఆ దేశం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

నాడు బంగ్లాదేశ్‌కు భారత సైన్యం అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆ సమయంలో పాకిస్థాన్ ఎన్నో పర్యావసనాలు ఎదుర్కొందని అన్నారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచే ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. బెంగాల్ లేదా కోల్‌కతాపై కన్నేస్తే పాకిస్థాన్ ఇంకెన్ని ముక్కలవుతుందోనని హెచ్చరించారు.
Advertisement
Rajnath Singh
Pakistan
Kolkata
West Bengal
Defense Minister
India
Khawaja Asif
1971 War

More Telugu News