Rahul Gandhi: సీఎం విజయన్ ఏమైనా దైవాంశ సంభూతుడా?: రాహుల్ గాంధీ

Rahul Gandhi Slams Kerala CM Pinarayi Vijayan
షార్ట్స్‌లో చూడండి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయన్ ఏమీ దైవాంశ సంభూతుడు కాదని, ఆయన పాలనలో అహంకారం కనిపిస్తోందని అన్నారు. త్రిస్సూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన రాహుల్.. కేరళలో బీజేపీ, వామపక్షాల (ఎల్డీఎఫ్) మధ్య రహస్య అవగాహన ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించినందుకు తనపై కేంద్ర ఏజెన్సీలు చర్యలు తీసుకున్నాయని, కానీ సీఎం విజయన్‌ను గానీ, ఆయన కుటుంబాన్ని గానీ ఎందుకు ప్రశ్నించడం లేదని రాహుల్ నిలదీశారు. ఈ పరిణామం బీజేపీ, లెఫ్ట్ నేతల మధ్య ఉన్న రాజకీయ ఒప్పందాన్ని బలపరుస్తోందని పేర్కొన్నారు. కేరళ పర్యటనల్లో ప్రధాని మోదీ మతపరమైన అంశాలు మాట్లాడతారని, కానీ శబరిమల స్మగ్లింగ్ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. వామపక్షాలకు సహాయం చేసేందుకే మోదీ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా కేవలం విజయన్ ఫొటోలతో ఉన్న పోస్టర్లను ప్రస్తావిస్తూ, పాలన అంతా ఒక్కరే చేస్తున్నారనే అభిప్రాయాన్ని కల్పించడం రాజకీయ అహంకారమని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ తరహా ఏకవ్యక్తి నాయకత్వం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మల పాలనలో కనిపిస్తుందని అన్నారు.

కేరళలో పాలన సాగించేందుకు విజయన్ ఒక్కరే సమర్థుడని ప్రచారం చేసుకోవడం ప్రజలను అవమానించడమేనని రాహుల్ అన్నారు. వినయం, ప్రజల సానుభూతి ఉన్న ఎందరో నాయకులు రాష్ట్రంలో ఉన్నారని, ప్రజాస్వామ్య నాయకత్వానికి అణకువ అవసరమని హితవు పలికారు. కేరళలో అసలైన పోరాటం యూడీఎఫ్‌కు, బీజేపీ-ఎల్‌డీఎఫ్ కూటమికి మధ్యేనని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Rahul Gandhi
Pinarayi Vijayan
Kerala
LDF
BJP
Narendra Modi
Kerala Politics
Election Campaign
Political Allegations
UDF

More Telugu News