LPG Tanker: భారత్ వైపు 46,000 టన్నుల ఎల్పీజీ... సురక్షితంగా హర్మూజ్ దాటుతున్న ట్యాంకర్
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ భారత్‌కు కీలక ఊరట లభించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా భారత్‌కు చెందిన భారీ ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ట్యాంకర్ తన ప్రయాణాన్ని సురక్షితంగా ప్రారంభించింది. ఈ పరిణామం దేశీయ వంటగ్యాస్ సరఫరాలకు భరోసా ఇస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
'గ్రీన్ సాల్వి' అనే ఈ నౌక 46,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్పీజీతో భారత్ వైపు వస్తోంది. ఇది ఒక్కటే కాకుండా, మరో రెండు భారత ఎల్పీజీ నౌకలకు నాయకత్వం వహిస్తూ ఒక కాన్వాయ్‌గా ప్రయాణిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటిన ఏడో భారత నౌక ఇదే కావడం గమనార్హం. ఈ నౌక తెల్లవారుజామున జలసంధిని దాటి బయటకు వస్తుందని సమాచారం.
భారత్, ఇరాన్ మధ్య దౌత్యపరమైన సమన్వయం కారణంగానే ఇది సాధ్యమైంది. న్యూఢిల్లీ, టెహ్రాన్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా భారత్‌ను 'మిత్ర దేశం'గా పరిగణిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ మన నౌకలు సురక్షితంగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చి, మార్గాన్ని సులభతరం చేసింది. ప్రస్తుతం ఈ నౌకలు ఇరాన్ నియంత్రణలోని ఉత్తర మార్గానికి బదులుగా ఒమన్ తీరానికి దగ్గరగా ఉన్న సురక్షితమైన దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్నాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సంక్షోభం ప్రపంచ ఇంధన సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం చూపింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాల్లో ఇది ఆందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలో భారత నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా రావడం దేశ ఇంధన భద్రతకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. మరో రెండు భారత ఎల్పీజీ నౌకలు కూడా త్వరలోనే ఈ జలసంధిని దాటనున్నాయి.