Sheikh Hasina: ఇంధన కొరతతో 4 గంటలకే ఆఫీస్ క్లోజ్.. బంగ్లాదేశ్ కీలక నిర్ణయాలు

Sheikh Hasina Government Closes Offices at 4 PM Due to Energy Crisis
షార్ట్స్‌లో చూడండి
ఇంధన కొరత కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరత కొనసాగుతున్నందున దుకాణాలు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, కార్యాలయాల పని సమయాన్ని కుదిస్తూ బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది.

అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో పని గంటలను కూడా గంట తగ్గించింది. ఇక మీదట సాయంత్రం ఐదు గంటలకు బదులు 4 గంటలకు కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించింది.

బ్యాంకింగ్ లావాదేవీలు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు బ్యాంకులు మూతబడనున్నాయి. అయితే హోటళ్లు, ఫార్మసీలు, అత్యవసర సేవలు, నిత్యావసర వస్తు మార్కెట్లకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంది.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌కు భారత్ 5,000 టన్నుల డీజిల్‌ను సరఫరా చేసింది. రాబోయే నాలుగు నెలల్లో 50,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను సరఫరా చేయాలని భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. ఆ దేశ విన్నపాన్ని పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది.
Go Back to Shorts
Sheikh Hasina
Bangladesh
energy crisis
fuel shortage
office timings
Bangladesh government

More Telugu News