హైదరాబాద్ సహా పలు నగరాల్లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
- ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు
- బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ సోదాలు
- గతంలో బెంగాల్‌లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
ఐప్యాక్ కన్సల్టెన్సీ డైరెక్టర్లలో ఒకరైన రిషిరాజ్ సింగ్‌కు చెందిన ప్రాంగణంపై కూడా దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కొంతకాలంగా సోదాలు జరుగుతున్నాయి. గతంలో బెంగాల్‌లోని ఐప్యాక్ కార్యాలయాలు, ఐప్యాక్ అధినేత ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. నాడు సోదాల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడకు వచ్చి, మీడియా ఎదుటే ఫైళ్లతో వెళ్తూ కనిపించడం చర్చకు దారితీసింది.
సోదాల సమయంలో బెంగాల్ ప్రభుత్వం నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ అప్పుడు ఆరోపించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు, మమతా బెనర్జీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపణలను ఖండించింది. సోదాల పేరుతో ఈడీ తన పరిధిని ఉల్లంఘించిందని ఆరోపించారు.