Donald Trump: హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్
హర్మూజ్ జలసంధిలో భద్రతను పశ్చిమాసియాపై ఆధారపడిన దేశాలే చూసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ వల్లే చమురు ధరలు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులకు ఆ దేశమే కారణమని తీవ్రంగా ఆరోపించారు. బుధవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఇరాన్ పిచ్చి ఉగ్రదాడులకు పాల్పడటం వల్లే గ్యాసోలిన్ ధరలు పెరిగాయి. ఇలాంటి ఇరాన్‌ను అణ్వాయుధాల విషయంలో ఎప్పటికీ నమ్మలేం" అని ట్రంప్ అన్నారు. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా చేసే దేశాలు ఇకపై భద్రతా భారాన్ని మోయాలని ఆయన తేల్చిచెప్పారు. "ఆ మార్గాన్ని వాళ్లే చూసుకోవాలి. దాన్ని వాళ్లే కాపాడుకోవాలి. చాలా దేశాలు ఈ వివాదంలో జోక్యం చేసుకోకుండా కేవలం లబ్ధి పొందుతున్నాయి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇతర దేశాలకు ఆయన రెండు మార్గాలను సూచించారు. "మొదటిది, అమెరికా నుంచి చమురు కొనండి. రెండోది, కాస్త ధైర్యం తెచ్చుకుని ఆ జలసంధికి వెళ్లి దాన్ని మీకోసం మీరే రక్షించుకోండి" అని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారు అని, సౌదీ అరేబియా, రష్యా కంటే కూడా ఎక్కువ ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. పశ్చిమాసియా నుంచి తమకు చమురు అవసరం లేదని, హర్మూజ్ ద్వారా తాము దాదాపుగా దిగుమతులు చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.
పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం మధ్య ఉన్న హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైనది. భారత్ వంటి దేశాలు తమ చమురు అవసరాల్లో అధిక భాగాన్ని గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే, అది భారత్‌లో ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటుపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రమాదం ఉంది.