Ram Charan: 'రాకాస' టీమ్ తో రామ్ చరణ్ చిట్ చాట్... వీడియో ఇదిగో!

Ram Charan Chit Chat with Rakasa Team
షార్ట్స్‌లో చూడండి
సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రాకాస'. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర యూనిట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న రామ్ చరణ్, తన సెట్స్‌కు వచ్చిన 'రాకాస' చిత్ర బృందంతో కాసేపు సరదాగా గడిపారు.

ఈ సందర్భంగా సినిమా గురించి అడిగి తెలుసుకున్న చరణ్, టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. రామ్ చరణ్ ప్రశంసలతో తమలో కొత్త ఉత్సాహం నిండిందని 'రాకాస' చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. ఈ కలయికకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్‌తో కలిసి 'రాకాస' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనసా శర్మ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఒకరోజు ముందుగా, అంటే ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Go Back to Shorts
Ram Charan
Rakasa Movie
Sangeeth Shobhan
Nayan Sarika
Niharika Konidela
Pink Elephant Pictures
Telugu Cinema
Manasa Sharma
Peddi Movie
Telugu Film Release

More Telugu News