Sukumar: తెలంగాణ నేపథ్య కథతో సుకుమార్ నిర్మాణంలో సినిమా
గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో తెలంగాణ నేపథ్య కథలను తరచుగా చూస్తున్నాం. తెలంగాణ మట్టికథలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రధాన కథావస్తువుగా తీసుకుని దర్శకులు భావోద్వేగ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 'బలగం' ఈ కోవలోనే ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చిత్రాన్ని తెలంగాణలోని ప్రతి పల్లెలో తెరలు కట్టుకుని చూస్తూ ఎమోషనల్ అయ్యారు. 'బలగం' తరువాత తెలంగాణ నేపథ్య కథలతో సినిమాలు తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
ఇక త్వరలో మరో తెలంగాణ నేపథ్య కథతో సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ సంస్థపై చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా నటిస్తున్న వృషఖర్మ, రామ్‌చరణ్ 'పెద్ది' చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సుకుమార్, నిర్మాత బన్నీవాస్‌లు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
'బలగం' ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించనున్న ఈ చిత్రం తెలంగాణ నేపథ్య కథతో రూపొందనుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా ఓ నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. దర్శకుడిగా స్టార్స్‌తో పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కిస్తున్న దర్శకుడు సుకుమార్, నిర్మాతగా కూడా ఇలాంటి కథలతో చిన్న సినిమాలు నిర్మించడం నిజంగా ప్రశంసనీయం.