Psycho Thief: కర్ణాటకలో విచిత్ర దొంగ.. మహిళల లోదుస్తులే టార్గెట్!

Psycho thief targets womens innerwear in Karnatakas Gangavathi
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి పట్టణంలో ఓ వింత దొంగ స్థానికులను, ముఖ్యంగా మహిళలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాడు. రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి కేవలం మహిళల లోదుస్తులను మాత్రమే దొంగిలిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ ఘటనలు చోటుచేసుకుంటుండటంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

గంగావతి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ నివాస ప్రాంతమైన సీబీఎస్ కాలనీలో ఈ వింత దొంగతనాలు జరుగుతున్నాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి రాత్రి సమయంలో ఇళ్ల ప్రహరీ గోడలు దూకి, ఆరుబయట ఆరవేసిన మహిళల లోదుస్తులను ఎత్తుకెళ్తున్నాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. గత మూడు, నాలుగు రోజులుగా ఇదే తరహా ఘటనలు పునరావృతం కావడంతో తమ భద్రత, గోప్యతపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని ఓ ‘సైకో’గా అభివర్ణిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇలాంటి వింత ఘటనలు కర్ణాటకలో జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్ 30న హుబ్బళ్లిలోని బెండిగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాగే మహిళల లోదుస్తులను దొంగిలించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల తర్వాత ఆ దొంగిలించిన దుస్తులను తిరిగి అదే ఇళ్లలో పడేసేవాడని విచారణలో తేలింది. అలాగే, బెంగళూరు హెబ్బగోడి పోలీసులు ఓ 23 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. అతను మహిళల లోదుస్తులు ధరించి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ మహిళలను భయభ్రాంతులకు గురిచేశాడు.

ఇలాంటి ప్రవర్తన కొన్నిసార్లు తీవ్రమైన నేరాలకు సంకేతంగా మారుతుంది. 2002లో అరెస్టయిన సీరియల్ రేపిస్ట్, హంతకుడు ఉమేశ్‌ రెడ్డి కేసు దీనికి ఉదాహరణ. అతడిని అరెస్ట్ చేసే సమయానికి మహిళల బ్రా, ప్యాంటీ ధరించి ఉన్నాడు. అతని వద్ద నుంచి 10 బ్రాలు, 18 ప్యాంటీలు, చీరలు, నైటీలతో పాటు పెద్ద మొత్తంలో మహిళల దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గంగావతి ఘటనపై పోలీసులు దృష్టి సారించి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Psycho Thief
Karnataka Lingerie Thief
Karnataka
Koppal district
Gangavati
Lingerie theft
Crime news
Women's underwear
CBS Colony
Hubballi
Umesh Reddy

More Telugu News