Varun Tej: వాలీబాల్ నేపథ్యంలో వరుణ్ తేజ్ 'బరి'... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. 'బరి' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ వేడుక జరిగింది. ఈ సినిమాకు వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కమిటీ కుర్రాళ్లు' చిత్రంతో గుర్తింపు పొందిన యదువంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలోని వాలీబాల్ క్రీడ ఆధారంగా ఈ సినిమాను హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' అనే హారర్ కామెడీ సినిమా షూటింగ్లో చివరి దశలో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే 'బరి' చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.