Sanjana Ganesan: బుమ్రాకు సంజనా ఫన్నీ వార్నింగ్.. 'ధురంధర్ 2' డైలాగ్‌తో ఆటపట్టించిన భార్య

Jasprit Bumrah Hilariously Trolled by Wife Sanjana with Dhurandhar 2 Dialogue
షార్ట్స్‌లో చూడండి
'ధురంధర్ 2' సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం సరికొత్త ట్రెండ్స్‌కు కేంద్రంగా నిలుస్తోంది. సినిమాలోని ప్లాట్ ట్విస్టులు, నటీనటుల అద్భుత ప్రదర్శన ఒక ఎత్తైతే, ఇందులోని ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. "ఘర్ కీ యాద్ నహీ ఆయీ తుఝే, జస్సీ?" (జస్సీ, నీకు ఇల్లు గుర్తురాలేదా?) అనే ఈ డైలాగ్ మీమ్ ఫెస్ట్‌కు దారితీసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ డైలాగ్‌ను తమదైన శైలిలో వాడుతూ సందడి చేస్తున్నారు.

తాజాగా ఈ ట్రెండ్‌లో భారత స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్ కూడా చేరారు. తన భర్త బుమ్రాను సరదాగా ఆటపట్టిస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "ప్రతిసారీ జస్ప్రీత్ 'బాయ్స్ నైట్' కోసం ప్లాన్ చేసినప్పుడు నా స్పందన ఇలాగే ఉంటుంది" అని క్యాప్షన్ జోడించి, "మీ: ఘర్ కీ యాద్ నహీ ఆయీ తుఝే, జస్సీ?" అంటూ పోస్ట్ చేశారు. భర్త స్నేహితులతో బయటకు వెళ్లాలని అనుకున్నప్పుడల్లా తాను ఈ డైలాగ్‌తో అతడిని ఆటపట్టిస్తానంటూ ఆమె చేసిన ఈ ఫన్నీ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇంతకీ ఈ డైలాగ్ సినిమాలో ఎక్కడ వస్తుందంటే, కథలో అత్యంత కీలకమైన, భావోద్వేగమైన సన్నివేశంలో దీన్ని ఉపయోగించారు. పాకిస్థాన్‌లో భారత గూఢచారి 'హంజా'గా పనిచేస్తున్న తన చిన్ననాటి స్నేహితుడు జస్కీరత్ (రణ్‌వీర్ సింగ్)ను, గుర్బాజ్ సింగ్ (పిండా) గుర్తించే సందర్భంలో ఈ డైలాగ్ వస్తుంది. శత్రు దేశంలో తన ప్రాణ స్నేహితుడిని చూసినప్పుడు, "ఇల్లు గుర్తురాలేదా జస్సీ?" అంటూ గుర్బాజ్ సింగ్ అడిగే తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతటి సీరియస్ డైలాగ్‌ను ఇప్పుడు నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌గా మార్చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. మొత్తం మీద 'ధురంధర్ 2' సినిమా థియేటర్లలోనే కాకుండా, ఆన్‌లైన్‌లో కూడా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది.

Go Back to Shorts
Sanjana Ganesan
Jasprit Bumrah
Dhurandhar 2
Ranveer Singh
meme
viral post
bollywood dialogue
cricket
sports presenter
social media trend

More Telugu News