Ranveer Singh: ‘ధురంధర్ 2’ ఏఐ పోస్టర్‌తో వివాదం.. రణవీర్ సింగ్‌పై సిక్కుల ఫిర్యాదు

Ranveer Singh faces Sikh complaint over Dhurandhar 2 AI poster
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన ‘ధురంధర్ 2’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఏఐ జనరేటెడ్ పోస్టర్‌పై సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ పోస్టర్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పోస్టర్‌లో రణవీర్ సింగ్ ‘కిరాత్‌పూర్ సింగ్’ అనే సిక్కు యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. అయితే, ఏఐతో రూపొందించిన ఈ చిత్రంలో సిక్కు గురువుల చిత్రాలను, పవిత్ర మత చిహ్నాలను అగౌరవపరిచే విధంగా ఉపయోగించారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తమ చరిత్ర, సంస్కృతి, మత విశ్వాసాలతో ఆటలాడటం సరికాదని, ఇది సమాజంలో అనవసర ఘర్షణలకు దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదులో కేవలం రణవీర్ సింగ్‌ తో పాటు సినిమా దర్శక నిర్మాతలు కూడా బాధ్యత వహించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని సిక్కు సంఘాల ప్రతినిధులు కోరారు. అయితే, ఈ వివాదంపై రణవీర్ సింగ్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
Go Back to Shorts
Ranveer Singh
Dhurandhar 2
Sikh community
AI poster controversy
Kiratpur Singh
Sikh sentiments
Religious symbols
Bollywood
Police complaint
Film director

More Telugu News