Donald Trump: ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ చర్చ.. వైరల్ అయిన వీడియో!

Donald Trump Health Concerns Rise After Viral Video
షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిన్న‌ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోకు చేరుకున్న ఆయన, ఎయిర్ ఫోర్స్ వన్ విమానం నుంచి దిగుతున్నప్పుడు తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే ఇందుకు కారణం. ఈ వీడియోలో ఆయన మెట్లు దిగుతున్నప్పుడు కాస్త నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు కనిపించారు. 

79 ఏళ్ల ట్రంప్, విమానం మెట్లకు ఉన్న రెయిలింగ్‌ను పట్టుకుని నిదానంగా కిందకు దిగడం ఈ క్లిప్‌లో రికార్డయింది. ఈ వీడియోను 'ఎక్స్‌' (ట్విట్టర్) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చాలా మంది షేర్ చేశారు. "ట్రంప్ నిజంగా వయసు పైబడినట్లు, అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు కూడా సరిగా దిగలేకపోతున్నారు" అనే క్యాప్షన్‌తో ఒక పోస్ట్ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ట్రంప్ అలసిపోయినట్లు, అస్థిరంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు ఈ వాదనలను కొట్టిపారేశారు. "ఆయన ఆరోగ్యం గురించి నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది" అని ఒకరు వ్యాఖ్యానించగా, మరికొందరు ఆయన వయసు, ఆహారపు అలవాట్లను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.

గత కొద్ది నెలలుగా ట్రంప్ ఆరోగ్యంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేతులు రంగుమారాయని, కాళ్లు వాచినట్లు కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, వైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ ఇచ్చిన నివేదికను ఉటంకిస్తూ, తాను "అత్యంత ఆరోగ్యవంతుడైన అధ్యక్షుడినని" ట్రంప్ గతంలో స్పష్టం చేశారు. తాజా వీడియోతో ఆయన శారీరక దారుఢ్యంపై మరోసారి చర్చ మొదలైంది.
Go Back to Shorts
Donald Trump
Trump health
Donald Trump age
Air Force One
Mar-a-Lago
Trump video
Trump physical fitness
US President
Ronny Jackson
Trump stairs

More Telugu News