Dhurandhar 2: 'ధురంధర్ 2' తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. రిలీజ్‌కు లైన్ క్లియర్

Ranveer Singhs Dhurandhar 2 Telugu Release Cleared
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ తెలుగు వెర్షన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ప్రదర్శనలు ఇవాళ‌ మధ్యాహ్నం నుంచి థియేటర్లలో ప్రారంభం కానున్నాయి. దీంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది.

వాస్తవానికి ఈ సినిమా హిందీ వెర్షన్‌తో పాటే ఈ నెల‌ 19న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కావాల్సి ఉంది. అయితే, కంటెంట్ డెలివరీలో జాప్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో డబ్బింగ్ వెర్షన్ల షోలు రద్దయ్యాయి. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురికాగా, థియేటర్ యాజమాన్యాలు వారికి డబ్బులు వాపసు ఇవ్వాల్సి వచ్చింది. 

తాజాగా ఈ సమస్యలను అధిగమించి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి అనుమతులు పొందారు. ఈ నెల‌ 19వ తేదీనే తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు సెన్సార్ క్లియరెన్స్ లభించింది. అయితే, కన్నడ వెర్షన్ సర్టిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. సెన్సార్ వివరాల ప్రకారం ఈ డబ్బింగ్ చిత్రాల నిడివి 3 గంటల 51 నిమిషాలుగా ఉంది. హిందీ వెర్షన్ (3 గంటలు 49 నిమిషాలు) కంటే ఇది కొద్దిగా ఎక్కువ. ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు. ప్రస్తుతం బుక్ మై షో వంటి ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోనూ టికెట్ బుకింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి.
Go Back to Shorts
Dhurandhar 2
Dhurandhar 2 Telugu
Ranveer Singh
Bollywood movies
Telugu dubbed movies
South Indian cinema
Action thriller
Spy thriller
Movie release
CBFC

More Telugu News