Pawan Kalyan: ఆ యువకుడు చెప్పిన మాటలను అంత సులభంగా మర్చిపోలేను: పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్
ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ 'దివ్యాంగ శక్తి' అనే పథకాన్ని ప్రారంభించింది. ఇవాళ విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంగళగిరి బస్ డిపో నుంచి పెనుమాక వరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. వారి బాగోగులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రయాణంలో తన అనుభవాలను, ముఖ్యంగా ఓ యువకుడితో జరిపిన సంభాషణను డిప్యూటీ సీఎం పవన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ యువకుడు చెప్పిన మాటలను అంత సులభంగా మర్చిపోలేనంటూ ఆయన భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. "దివ్యాంగుల సమస్యలు వినాలనుకునే వ్యక్తిగా పల్లె వెలుగు బస్సు ఎక్కాను. వారి మాటల్లోని నిజాయితీ, శక్తి నన్ను ఆకట్టుకున్నాయి. అయితే, ఓ యువకుడితో జరిపిన సంభాషణ నా మదిలో నిలిచిపోయింది" అని పవన్ పేర్కొన్నారు.
స్పెషల్ ఎడ్యుకేటర్‌గా శిక్షణ పొందుతున్న జేఎన్‌టీయూ విద్యార్థి అయిన ఆ యువకుడు, ఆర్థికవేత్త అమర్త్య సేన్ చెప్పిన 'డబుల్ హ్యాండికాప్' అంశాన్ని ప్రస్తావించాడని పవన్ తెలిపారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే, దివ్యాంగులు సాధారణ జీవితం గడిపేందుకు రెండింతల ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుందని ఆ యువకుడు వివరించినట్లు పవన్ పేర్కొన్నారు. 'దివ్యాంగ శక్తి' పథకం ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, రాష్ట్రానికి, దేశానికి సేవ చేసే అవకాశం కల్పిస్తుందని, అదే ఈ పథకానికి సార్థకత అని ఆ యువకుడు చెప్పిన మాటలు తనను కదిలించాయని పవన్ అన్నారు.
నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూ కూడా దేశ నిర్మాణం గురించి ఆలోచిస్తున్న ఆ యువకుడి దృక్పథం చాలా గొప్పదని కొనియాడారు. ‘దివ్యాంగ శక్తి’ కేవలం రవాణా సౌకర్యం కాదని, అది సమాజానికి తిరిగి సేవ చేసేందుకు ఇచ్చిన అవకాశమని పవన్ అభివర్ణించారు. మనం ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఈ రోజు తనకు స్పష్టంగా గుర్తు చేసిందంటూ పవన్ కల్యాణ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.