Sania Mirza: దుబాయ్ లో భయానక అనుభవాలను పంచుకున్న సానియా మీర్జా

Sania Mirza Shares Terrifying Experiences in Dubai
షార్ట్స్‌లో చూడండి

మిడిల్ ఈస్ట్ దేశాలలో ముదురుతున్న యుద్ధ మేఘాలు అక్కడ నివసిస్తున్న భారతీయులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కుమారుడు ఇజ్ హాన్ తో కలిసి క్షేమంగా దుబాయ్ నుండి భారత్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న అనుభవాలు అక్కడి భయానక స్థితికి అద్దం పడుతున్నాయి.


దుబాయ్‌లో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను వివరిస్తూ సానియా మీర్జా కాస్త ఉద్వేగానికి లోనయింది. తమ ఇంటిపై నుండే యుద్ధ విమానాలు వెళ్లడం, అవి ఒకదానికొకటి అడ్డుకోవడం చూసినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని ఆమె తెలిపింది. "మా ఇంటికి కేవలం 400 నుండి 500 మీటర్ల దూరంలోనే విమాన శకలాలు పడ్డాయి. ఆ శబ్దాలకు, దృశ్యాలకు ఇంట్లోనే ఉండి వణికిపోయాం" అని సానియా పేర్కొంది. ప్రస్తుతం కొడుకుతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన ఆమె, రంజాన్ పండుగ ముగిసిన తర్వాత పరిస్థితులు చక్కబడితేనే తిరిగి దుబాయ్ వెళ్లాలని భావిస్తోంది.

Go Back to Shorts
Sania Mirza
Dubai
India
War tensions
Middle East
Tennis star
Izhaan Mirza Malik
Hyderabad
Warplanes
Flight debris

More Telugu News