హనుమకొండలో ఘోరం.. అనుమానాస్పద స్థితిలో తండ్రీకూతుళ్ల సజీవదహనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హనుమకొండలో ఘోరం.. అనుమానాస్పద స్థితిలో తండ్రీకూతుళ్ల సజీవదహనం

Hanumakonda Father Daughter Cremated Alive Husband Suspected
  • కుటుంబ కలహాలే కారణమని అనుమానం
  • భార్య, మామపై డీజిల్ పోసి నిప్పంటించినట్లు భర్తపై అనుమానం
  • నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తండ్రి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో సజీవదహనమయ్యారు. కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్పలో ఇవాళ‌ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘోర ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే... మృతులను రాజశేఖర్ (54), ఆయన కుమార్తె రాజశ్రీ (24)గా పోలీసులు గుర్తించారు. రాజశ్రీ భర్త ప్రవీణే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు భార్య, మామపై డీజిల్ పోసి నిప్పంటించి ఉంటాడని భావిస్తున్నారు. రాజశ్రీకి ప్రవీణ్‌తో 2023లో వివాహం కాగా, వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.

స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Advertisement
Hanumakonda
Rajasekhar
Kadipikonda
Father daughter burnt alive
Family dispute
Praveen
Rajashree
Telangana crime news
Crime news
Hanamkonda news

More Telugu News