Andhra Pradesh: ఏపీ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక 24 గంటలూ షాపులు ఓపెన్..!
ఏపీలోని వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సులభతర వాణిజ్యంలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, వాణిజ్య సంస్థలను 24 గంటలూ నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 4 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.
రాష్ట్ర కార్మిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. షాపులు, వాణిజ్య సంస్థల చట్టం-1988లోని కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ వెసులుబాటు కల్పిస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిబంధనలను విధించింది. ప్రతి ఉద్యోగితో వారానికి గరిష్ఠంగా 48 గంటలు మాత్రమే పని చేయించాలని, ఆ సమయం మించితే తప్పనిసరిగా ఓవర్ టైం జీతం చెల్లించాలని ఆదేశించింది.
అలాగే, ఉద్యోగులందరికీ వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ సెలవు దినాల్లో పని చేయించాల్సి వస్తే, అందుకు బదులుగా మరో రోజు ప్రత్యామ్నాయ సెలవు మంజూరు చేయాలని పేర్కొంది. దీంతో పాటు 20 మంది లేదా అంతకంటే ఎక్కువ సిబ్బంది ఉన్న సంస్థలు లైఫ్‌టైమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందేందుకు కూడా కార్మిక శాఖ అనుమతించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉండగా, అదే సమయంలో ఉద్యోగుల హక్కులకు భద్రత కల్పించడం గమనార్హం.