యుద్ధం వల్ల అమెరికాకు భారీగా ఖర్చు.. తొలి 6 రోజుల్లోనే లక్ష కోట్లు
- ఇరాన్ పై దాడులకు అత్యాధునిక మిసైళ్లు ప్రయోగిస్తున్న అగ్రరాజ్యం
- యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే సూచనలతో అదనపు నిధుల కోసం ట్రంప్ సర్కార్ వేట
- మరో 50 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించాలని కాంగ్రెస్ కు ప్రతిపాదనలు
యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే సూచనలు కనిపిస్తుండటంతో అదనపు నిధుల కోసం ట్రంప్ సర్కార్ వేట మొదలుపెట్టింది. త్వరలోనే మరో 50 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించాలని కోరుతూ వైట్‌హౌస్ కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపనుంది. ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ నిల్వలు నిండుకుంటున్నాయని, ప్రస్తుత యుద్ధం సైనిక శక్తిని మరింత కుంగదీస్తుందని కాంగ్రెస్ సభ్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తకుండా చమురు నిల్వలను విడుదల చేసేందుకు కూడా అమెరికా సన్నాహాలు చేస్తోంది.