Chris Wright: ఎక్స్ లో అమెరికా మంత్రి పోస్ట్.. స్టాక్ మార్కెట్లో పడిపోయిన చమురు ధరలు
- చమురు ట్యాంకర్లకు అమెరికా నౌకాదళం రక్షణ ఇచ్చిందన్న మంత్రి
- కొద్దిసేపటికే ఆ పోస్ట్‌ను తొలగించిన ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్
- అలాంటిదేమీ లేదని స్పష్టం చేసిన వైట్ హౌస్, పెంటగాన్
- మంత్రి ప్రకటనతో 15 శాతానికి పైగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలు
ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో అమెరికా ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఒక పోస్ట్, తర్వాత దాన్ని తొలగించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మీదుగా చమురు రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి క్రిస్ రైట్ ఎక్స్ వేదికగా.. "ప్రపంచ మార్కెట్లకు చమురు సరఫరా ఆగిపోకుండా ఉండేందుకు, అమెరికా నౌకాదళం విజయవంతంగా ఒక చమురు ట్యాంకర్‌కు రక్షణగా వెళ్లింది" అని పోస్ట్ చేశారు. యుద్ధం మొదలైన తర్వాత అమెరికా నౌకాదళం ఇలాంటి చర్యకు దిగడం ఇదే మొదటిసారి అని భావించిన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా స్పందించాయి. దీంతో చమురు ధరలు సుమారు 15 నుంచి 17 శాతం వరకు పడిపోయాయి.
అయితే, ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మంత్రి దానిని తొలగించారు. దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ.. ప్రస్తుతానికి అమెరికా నౌకాదళం ఏ చమురు ట్యాంకర్‌కు రక్షణగా వెళ్లలేదని స్పష్టం చేశారు. మంత్రి కార్యాలయ సిబ్బంది పొరపాటున ఆ పోస్ట్ చేశారని, అందుకే దానిని వెంటనే తొలగించారని వివరించారు. భవిష్యత్తులో అవసరమైతే నౌకాదళ రక్షణ కల్పిస్తామని, కానీ ప్రస్తుతం అలాంటిదేమీ జరగలేదని ఆమె తేల్చి చెప్పారు.
మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. అమెరికా యుద్ధ నౌకలేవీ హార్ముజ్ జలసంధి దరిదాపుల్లోకి వచ్చే ధైర్యం చేయలేదని, మంత్రి చేసినవన్నీ అబద్ధాలని కొట్టిపారేసింది. మార్కెట్లను ప్రభావితం చేయడానికే అమెరికా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించారు.