Janhvi Kapoor: తన చెల్లెలు జాన్వీ కపూర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన అర్జున్ కపూర్
- నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నటి జాన్వీ కపూర్
- సోదరికి వెరైటీ ఫోటోతో విషెస్ చెప్పిన అర్జున్ కపూర్
- నువ్వు లేకుండా నేను లేనంటూ ఖుషీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
- సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
- తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న జాన్వీ
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆమె సోదరుడు, నటుడు అర్జున్ కపూర్, సోదరి ఖుషీ కపూర్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపారు.
అర్జున్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో జాన్వీతో ఉన్న ఓ సరదా ఫోటోను షేర్ చేశారు. ఇందులో జాన్వీ నల్లటి పొట్టి డ్రెస్, స్టైలిష్ కళ్లజోడుతో ఉండగా.. అర్జున్ తెల్లటి సూట్లో ఓ డమ్మీ తుపాకీ పట్టుకుని పోజులిచ్చారు. "మన గొడవలు, అల్లరి, సరదాలన్నింటి మధ్య.. హ్యాపీ బర్త్డే జాన్వీ కపూర్" అంటూ ఆత్మీయంగా రాసుకొచ్చారు.
జాన్వీ సోదరి ఖుషీ కపూర్ కూడా వీరిద్దరి అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. "హ్యాపీ బర్త్ డే అక్కా.. నా బెస్ట్ ఫ్రెండ్, నా సలహాదారు, నా గురువు, నా పార్ట్ నర్ ఇన్ క్రైమ్ అన్నీ నువ్వే. నన్ను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో నీ పాత్ర ఎంతో ఉంది. నువ్వు లేకుండా నేను లేను. ప్రతి జన్మలోనూ నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను.. లవ్ యూ" అంటూ ఖుషీ తన ప్రేమను చాటుకున్నారు. అన్షులా కపూర్ కూడా జాన్వీతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ విషెస్ చెప్పారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ ధావన్, కృతి సనన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు జాన్వీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ప్రతి ఏటా తన పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జాన్వీకి ఆనవాయతీగా వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆమె తిరుమల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.