26 రకాల వివరాలతో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు: సీఎం చంద్రబాబు
- అసెంబ్లీ చాంబర్లో ఎఫ్బీఎంఎస్పై సీఎం చంద్రబాబు సమీక్ష
- వివిధ శాఖల నుంచి సమాచారాన్ని సమీకృతం చేయాలని సూచన
- ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటాబేస్ సిద్ధం చేయనున్న అధికారులు
- 26 రకాల అంశాలతో పకడ్బందీగా డేటాబేస్ రూపొందించాలన్న సీఎం
ఈ డేటాబేస్ రూపకల్పన కోసం ఎస్జీఎస్డబ్ల్యూ, డిస్కమ్స్, పురపాలక శాఖ, వెబ్‌ల్యాండ్, వాహన్, హెచ్ఆర్ఎంఎస్, పంచాయతీరాజ్, మార్క్‌ఫెడ్ వంటి వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించి ఇందులో పొందుపరచాలని సీఎం సూచించారు. ప్రస్తుతం 82 శాతం సమాచారం సిద్ధంగా ఉందని, వచ్చే ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటాబేస్ పూర్తిచేస్తామని అధికారులు వివరించారు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వంలోని అన్ని శాఖల వద్ద ఉన్న డేటాను సమీకృతం చేయడం ద్వారానే సమాచారంలో కచ్చితత్వం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 'ఫ్యామిలీ కార్డు' అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దీనికి అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.