Ayatollah Ali Khamenei: శనివారం ఉదయమే దాడి చేయడం వెనుకున్న కారణం ఇదే..!

Reason for Saturday morning attack on Ayatollah Ali Khamenei
  • ఖమేనీకి దాక్కునే అవకాశం ఇవ్వకూడదన్నదే ఉద్దేశం
  • తప్పించుకోకుండా ‘సర్ ప్రైజ్’ అటాక్
  • బంకర్లలోకి వెళ్లేలోపే విధ్వంసం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని శనివారం ఉదయమే దాడులు చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఖమేనీ తన ముఖ్య సలహాదారులతో భేటీ అవుతున్నారన్న సమాచారమే ఈ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి నాంది పలికింది. ఖమేనీకి కొద్దిగా సమయం ఇచ్చినా ఆయన భూగర్భ రహస్య స్థావరాల్లోకి వెళ్లి దాక్కుంటారని భావించారు. 

అందుకే ఆయన భేటీలో ఉన్నప్పుడే 'సర్ ప్రైజ్ అటాక్' చేయాలని నిర్ణయించారు. తొలుత శనివారం సాయంత్రం అనుకున్న ఈ దాడులను, నిఘా సమాచారం మేరకు శనివారం ఉదయానికే మార్చారు. అమెరికాలోని వాషింగ్టన్‌ లో అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే.. అంటే ఇరాన్‌లో పట్టపగలు సమయంలో ఈ మెరుపు దాడులు జరిపి ఖమేనీ నివాసాన్ని బంకర్లతో సహా ధ్వంసం చేశారు.
Ayatollah Ali Khamenei
Iran
Khamenei
US military operation
Operation Epic Fury
Iran supreme leader
US airstrike
Iran secret hideouts
Washington
Surprise attack

More Telugu News