న్యూజిలాండ్‌తో సూపర్-8 మ్యాచ్... ఇంగ్లండ్ ముందు ఈజీ టార్గెట్!

New Zealand vs England T20 World Cup Target 160
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరుగుతున్న సూపర్-8 గ్రూప్ 2 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్‌కు160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

కివీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ జట్టుకు శుభారంభాన్ని అందించారు. పవర్ ప్లేలో ఇద్దరూ దూకుడుగా ఆడారు. టిమ్ సీఫెర్ట్ 25 బంతుల్లో 35 పరుగులు చేయగా, ఫిన్ అలెన్ 19 బంతుల్లో 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరూ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో కివీస్ స్కోరు బోర్డు వేగం తగ్గింది. మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ (39) బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతనికి మార్క్ చాప్‌మన్ (15), చివర్లో కోల్ మెక్‌కానీ (14) నుంచి కొద్దిపాటి సహకారం లభించింది.

ఇంగ్లండ్ బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. విల్ జాక్స్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్ (2/28), రెహాన్ అహ్మద్ (2/28) కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. లియామ్ డాసన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 160 పరుగులు చేయాల్సి ఉంది.
Go Back to Shorts
New Zealand Cricket
England Cricket
T20 World Cup 2026
Tim Seifert
Finn Allen
Glenn Phillips
Will Jacks
Adil Rashid
Rehan Ahmed
Colombo

More Telugu News