Sri Lanka Cricket: న్యూజిలాండ్ చేతిలో 61 పరుగుల తేడాతో చిత్తు... సెమీస్ రేసు నుంచి శ్రీలంక నిష్క్రమణ

Sri Lanka knocked out of Semis after loss to New Zealand
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసిన న్యూజిలాండ్
  • 169 పరుగుల లక్ష్యంతో దిగి 107 పరుగులు చేసిన శ్రీలంక
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో శ్రీలంకను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి దిగిన శ్రీలంక పూర్తి ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. శ్రీలంక 61 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.

కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ జట్టులో మిచెల్ సాంట్నర్ దూకుడుగా ఆడి 26 బంతుల్లో 47 పరుగులు చేశాడు. కోలె మెక్‌కాంచి 23 బంతుల్లో 31 పరుగులు, ఫిన్ అలెన్ 13 బంతుల్లో 23 పరుగులు, రచిన్ రవీంద్రా 22 బంతుల్లో 32 పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో మూడు వికెట్లు తీయగా, దునిత్ వెల్లలాగే 1 వికెట్ తీశారు.

శ్రీలంక ఆటగాళ్లలో కమిందు మెండిస్ 23 బంతుల్లో 31 పరుగులు, దునిత్ వెల్లలాగే 23 బంతుల్లో 29 పరుగులతో రాణించారు. మిగిలిన ఆటగాళ్లు ఏమాత్రం పరుగులు రాబట్టలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్రా 4, మాట్ హెన్రీ రెండు, పిలిప్స్, సాంట్నర్ ఒక్కో వికెట్ తీశారు. సూపర్-8లో వరుసగా రెండో ఓటమి నేపథ్యంలో శ్రీలంక సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
Sri Lanka Cricket
New Zealand Cricket
T20 World Cup
Super 8
Match Result
Mitchell Santner

More Telugu News